HomeMovie News Teluguబన్నీకి కన్ను కొట్టిన ప్రియా వారియర్‌.!

బన్నీకి కన్ను కొట్టిన ప్రియా వారియర్‌.!

కన్ను గీటి, రాత్రికి రాత్రే దేశం దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ మలయాళంలో నటించిన ‘ఒరు ఆధార్‌ లవ్‌’ సినిమా తెలుగులోకి రాబోతోంది. ఫిబ్రవరి 14న లవర్స్‌డే సందర్భంగా ‘లవర్స్‌ డే’ టైటిల్‌తోనే ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు. ప్రియా ప్రకాష్‌ వారియర్‌కి పెద్దగా పరిచయం అక్కర్లేదు. పబ్లిసిటీ కూడా అవసరం లేదు. కానీ సినిమాని ప్రమోట్‌ చేయాలి కదా. 

అందుకే ‘లవర్స్‌ డే’ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని హైద్రాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కి స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఈ వేదికపై ప్రియా ప్రకాష్‌ వారియర్‌ బన్నీకి కన్ను కొట్టింది. యాంకర్‌ సుమ కోరిక మేరకు సినిమాలో హీరోకి గురి చూసి కన్ను గీటినట్లే, అల్లు అర్జున్‌కి కూడా లైవ్‌గా కన్ను గీటింది ప్రియా ప్రకాష్‌ వారియర్‌. ఆమె గన్ను గీటుకు బన్నీ తెగ మెలికలు తిరిగేశాడు. 

తర్వాత అభిమానులనుద్దేశించి స్టేజ్‌ పైనుండి అల్లు అర్జున్‌ కూడా గన్ను ఎక్కుపెట్టి కన్ను గీటాడు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం బన్నీ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నాడు. త్వరలో సెట్స్‌ మీదికెళ్లనుంది ఈ సినిమా.

You May Like This
- Advertisment -spot_img

Most Popular