HomeMovie News Teluguబికినీ లీక్స్‌: హన్సిక 'దేశముదురే' సుమీ.!

బికినీ లీక్స్‌: హన్సిక ‘దేశముదురే’ సుమీ.!

ఈ మధ్య హీరోయిన్స్‌ పర్సనల్‌ ఫోటో లీక్స్‌ వివాదాంశమవుతున్న సంగతి తెలిసిందే. గతంలో కమల్‌హాసన్‌ తనయ అక్షరా హాసన్‌ పర్సనల్‌ ఫోటోస్‌ లీక్‌ అయ్యి మీడియాలో రచ్చ రంభోలా అయిన సంగతి తెలిసిందే. తాజాగా అదే తరహాలో మరో ముద్దుగుమ్మ హన్సికా మోట్వాని పర్సనల్‌ ఫోటోస్‌ కొన్ని బయటికి వచ్చాయి. నెట్టింట్లో ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అందులో కొన్ని బికినీ ఫోటోలు కూడా ఉన్నాయి. అలాగే అద్దంలో సెల్ఫీలు తీసుకుంటున్న ఫోటోలూ ఉన్నాయి. అచ్చం అక్షరాహాసన్‌లాగే. 

అయితే ఇక్కడ ఇంకొంచెం అప్‌డేట్‌ వెర్షన్‌. ఫోటోలతో పాటు వీడియో కూడా ఉందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వీడియో ఎక్కడా కనిపించలేదు. కానీ సోషల్‌ మీడియాలో ప్రచారం అయితే జోరుగా వినిపిస్తోంది. అయితే హన్సికకు తెలియకుండా ఈ ఫోటోలు బయటికి వచ్చే అవకాశం లేదు. అందుకే ఇలా తన పర్సనల్‌ ఫోటోస్‌ని తానే లీక్‌ చేసి, హన్సిక పబ్లిసిటీ స్టంట్‌ చేస్తోదంటూ ఓ వాదన కూడా వినికిడి. 

అయితే నిజంగానే హన్సిక ఇలాంటి ‘దేశముదురు’ తెలివితేటలు చూపిస్తుందా.? ప్రస్తుతం హన్సిక నటిస్తున్న థ్రిల్లర్‌ మూవీ ‘మహా’ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా పోస్టర్స్‌ విషయంలో ఈ మధ్య వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా పబ్లిసిటీ కోసమే హన్సిక ఇలా చేస్తోందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు నిజమేంటో తెలియాల్సి ఉంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular