HomeMovie News Telugu'క్వీన్‌' రీమేక్స్‌ ఆ సీన్‌లో కాజల్‌ మాత్రమేనా.?

‘క్వీన్‌’ రీమేక్స్‌ ఆ సీన్‌లో కాజల్‌ మాత్రమేనా.?

లేటెస్టుగా విడుదలైన ‘క్వీన్‌’ టీజర్స్‌ ఇప్పుడు హాట్‌ ఆఫ్‌ ది టాపిక్‌గా మారాయి. ఒకే సినిమాని నాలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న వైనం. నాలుగు సినిమాలకూ దగ్గర పోలిక ఉన్నట్లే అనిపిస్తున్నట్లే కనిపించినా, ఎక్కడా సింక్‌ కాకుండా జాగ్రత్త పడ్డారు డైరెక్టర్లు. నాలుగు సినిమాలు, ముగ్గురు దర్శకులు రూపొందిస్తున్నారు.

కాగా అసలు విషయానికి వస్తే, నాలుగు టీజర్స్‌లో కాజల్‌ నటించిన తమిళ టీజర్‌ ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ ముఖ్యంగా చర్చల్లో నిలిచింది. ఈ టీజర్‌లో కాజల్‌ ప్రైవేట్‌ ప్లేస్‌ టచ్‌ చేసే సీన్‌ ఒకటి అభ్యంతరకరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై సోషల్‌ మీడియాలో కాజల్‌పై ట్రోలింగ్‌ నడుస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఇదే సీన్‌ మిగిలిన మూడు సినిమాల్లో కూడా ఉందనేది కొందరి వాదన.

అయితే అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌ ప్రకారం మంజిమా మోహన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న మలయాళ రీమేక్‌లో మాత్రం ఈ సీన్‌ లేదట. అందుకు మంజిమా ఒప్పుకోలేదనీ తెలుస్తోంది. అలాగే తమన్నా నటిస్తున్న తెలుగు ‘క్వీన్‌’ రీమేక్‌లో కూడా ఈ సీన్‌ లేదంటున్నారు. పారుల్‌ యాదవ్‌ నటిస్తున్న కన్నడ రీమేక్‌లో మాత్రం ఇదే సీన్‌ ఏజ్‌ ఇట్‌ ఈజ్‌గా ఉందట.

నిజంగానే మలయాళంలోనూ, తెలుగులోనూ అక్కడ టచ్‌ చేసే సీన్‌ లేదంటారా.? లేక టీజర్‌ వరకూ మాత్రమే ఆ సీన్‌ని మిగతా వాటిలో సస్పెన్స్‌గా ఉంచారా.? అనేది సినిమాలు విడుదలైతే కానీ తీరని డౌట్‌. అంతే.!

You May Like This
- Advertisment -spot_img

Most Popular