HomeMovie News Teluguమ‌హేష్‌బాబు దారిలో బ‌న్నీ!

మ‌హేష్‌బాబు దారిలో బ‌న్నీ!

సినిమాలే కాదు, ఇత‌ర వ్యాపారాల‌పైనా మ‌న క‌థానాయ‌కులు దృష్టి పెడుతున్నారు. ఆ వ్యాపారం కూడా చిత్ర రంగంతోనే ముడి ప‌డి ఉండేలా చూసుకుంటున్నారు. తాజాగా మ‌హేష్‌బాబు ఓ మ‌ల్టీప్లెక్స్‌ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. కొత్త‌గుడ‌లో ఏఎంబీ పేరుతో మ‌ల్టీప్లెక్స్‌ని ఇటీవ‌లే ప్రారంభించారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే దారిలో వెళ్ల‌బోతున్న‌ట్టు స‌మాచారం.

అవును.. అల్లు అర్జున్ కూడా థియేట‌ర్ రంగంపై దృష్టి పెట్టాడు. ఇప్ప‌టికే గీతా ఆర్ట్స్ పేరిట కొన్ని థియేట‌ర్లు ఉన్నాయి. వాటిలో మ‌ల్టీప్లెక్స్‌లూ ఉన్నాయి. అయితే.. బ‌న్నీ స్వ‌యంగా రంగంలోకి దిగ‌లేదు. ఈసారి బ‌న్నీ ఓ మ‌ల్టీప్లెక్స్ ని నిర్మించ‌డానికి రంగం సిద్ధం చేసుకున్నాడ‌ని స‌మాచారం. హైద‌రాబాద్‌లోని అమీర్ పేట‌లో  ఓ స్థ‌లం కూడా కొనుగోలు చేశాడట‌. త్వ‌ర‌లోనే నిర్మాణం కూడా మొద‌లు కానున్న‌ద‌ని స‌మాచారం.

మ‌హేష్ మ‌ల్టీప్లెక్స్ లో కొంత‌మంది భాగ‌స్వాములు ఉన్నారు. అయితే బ‌న్నీ మాత్రం సోలోగా ఈ మ‌ల్టీప్లెక్స్‌ని న‌డ‌పాల‌ని భావిస్తున్నాడ‌ట‌. 2020లో ఈ థియేట‌ర్లు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular