HomeMovie News Teluguజిగేల్‌ రాణి' బ్యూటీ సీక్రెట్స్‌ ఇవిగో.!

జిగేల్‌ రాణి’ బ్యూటీ సీక్రెట్స్‌ ఇవిగో.!

ఈ ఏడాది ‘జిగేల్‌ రాణి‘ అంటూ రంగస్థలంలో పూజా హెగ్దే చేసిన ఐటెం సాంగ్‌ ఎంత రచ్చ రచ్చయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూజాని జిగేల్‌ రాణిగా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యాన్ని మించిన రేంజ్‌లో ఆ పాటలోని డాన్సులతో ఆకట్టుకుంది పూజా హెగ్దే. ఇక ఆ తర్వాత వచ్చిన ‘అరవింద సమేత‘ కూడా పూజాకి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ ఏడాది మూడు సినిమాలతో పూజాహెగ్దే సందడి చేసింది. అందులో ‘సాక్ష్యం’ కాస్త నిరాశపరిచినా కొట్టుకెళ్లిపోయింది.

ఇకపోతే కెరీర్‌ మొదట్నుంచీ పూజా హెగ్దే ఫిగర్‌లో ఎలాంటి మార్పులు లేవు. అందుకు కారణం ఆమె చేసే వ్యాయామాలేనట. ప్రతీరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పూజాకి అలవాటట. అయితే బరువు పెరగడం, తగ్గడం కోసమే వ్యాయామం కాదు, ఫిట్‌గా ఉండడం కోసం కూడా అంటోంది పూజా హెగ్దే. స్లిమ్‌గా ఉండాలంటే డైటింగ్‌ చేయడం మంచి పద్దతి కాదంటోంది. తనకు నచ్చిన ఫుడ్‌, నచ్చినంత తీసుకుంటుందట. అస్సలు డైటింగ్‌ పాఠించదట.

కానీ రెగ్యులర్‌గా ఎక్కువ మోతాదులో వాటర్‌ తీసుకుంటుందట. అనవసర విషయాల్ని పట్టించుకోకుండా, అవసరమైన విషయాల్ని లైట్‌ తీసుకోకుండా ఉంటే చాలు, ఫిట్‌గా ఎప్పుడూ హ్యాపీగా ఉండొచ్చు అంటోంది పూజా హెగ్దే. ప్రస్తుతం మన జిగేల్‌ రాణి మహేష్‌బాబుతో ‘మహర్షి’ సినిమాలో నటిస్తోంది. తర్వాత ప్రబాస్‌ – రాధాకృష్ణ కాంబోలో రూపొందుతోన్న చిత్రంలోనూ పూజాహెగ్దేనే హీరోయిన్‌. ఇవి కాక రెండు బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటిస్తోందట. చేతిలో నాలుగు సినిమాలతో ఇప్పుడప్పుడే పూజాహెగ్దే కెరీర్‌ డైరీ ఖాళీ లేదనే చెప్పాలి. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular