HomeMovie News Telugu'రోబో 2.0' నెవ్వర్‌ బిఫోర్‌ ఎక్స్‌పీరియన్స్‌ - మహేష్‌

‘రోబో 2.0’ నెవ్వర్‌ బిఫోర్‌ ఎక్స్‌పీరియన్స్‌ – మహేష్‌

వెండితెర విజువల్‌ అద్భుతంగా తెరకెక్కిన ‘రోబో 2.0’కి పలువురు సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ‘2.0’ని సినిమాటిక్‌ జెమ్‌గా అభివర్ణించారు. ఇంతకు ముందెన్నడూ చూడని అద్భుతం ‘2.0’ అన్నారు. దర్శకుడు శంకర్‌ ఈ సినిమాతో గేమ్‌ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లాడు.. సినిమాని నేను చాలా చాలా ఎంజాయ్‌ చేశాను.. అన్నారు. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌కి స్పెషల్‌గా కంగ్రాట్స్‌ తెలిపారు. టీమ్‌ మొత్తాన్ని అభినందించారు.

మహేష్‌ అభినందనలకు డైరెక్టర్‌ శంకర్‌ రిప్లై ఇస్తూ మహేష్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపోతే ప్రపంచం మొత్తం ఈ సినిమా గురించి ఎదురు చూసిన సంగతి తెలిసిందే. ఇదిగో రిలీజ్‌ అదిగో రిలీజ్‌ అంటూ వాయిదాల మీద వాయిదాల తర్వాత ఎట్టకేలకు ‘రోబో 2.0’ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రావడం రావడమే సినిమా బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ని అందుకుంది. ఫస్ట్‌డే 110 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది. సినిమా మొదలు నుండే అంచనాలు పెంచేసిన రోబో విడుదలయ్యాక ఆ అంచనాలను పూర్తిగా అందుకుందో లేదో పక్కాగా తెలియాలంటే ఇంకాస్త సమయం పడుతుంది.

ఇదిలా ఉంటే శంకర్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా ఓ సినిమా రావాల్సి ఉంది. అయితే గత నాలుగేళ్లుగా ‘2.0’తో శంకర్‌ బిజీ అయిపోయాడు. మహేష్‌బాబు ఎప్పుడూ బిజీనే. ఇప్పుడు వంశీ పైడిపల్లితో ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నాడు. తర్వాత సుకుమార్‌ సినిమా రెడీగా ఉంది. మరి శంకర్‌ – మహేష్‌ కాంబో ఎప్పుడు సెట్‌ అయ్యేనో చూడాలిక.

#2point0 is a cinematic gem!!! Gives you a never before seen experience… @shankarshanmugh sir ups his game to an all new level of sheer brilliance👌🏻 thoroughly enjoyed it 👍🏻👍🏻 Congratulations to @rajinikanth sir, @akshaykumar and the entire team of 2.0👏🏻👏🏻👏🏻— Mahesh Babu (@urstrulyMahesh) 30 November 2018

You May Like This
- Advertisment -spot_img

Most Popular