HomeMovie News Teluguరికార్డులు బద్దలుకొట్టేస్తోన్న '2.0'.!

రికార్డులు బద్దలుకొట్టేస్తోన్న ‘2.0’.!

భారీ బడ్జెట్‌తో భారీ అంచనాల నడుమ విడుదలైన ‘రోబో 2.0’కి ప్రశంసల సునామీ వెల్లివిరుస్తోంది. సినీ అభిమానులే కాదు, ఈ సినిమా కోసం సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆశక్తిగా ఎదురు చూశారు. ఈ మధ్య సరైన హిట్సే లేని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఈ సినిమాతో ఆయన స్టామినా ఏంటో నిరూపించారు. వన్‌ అండ్‌ ఓన్లీ సూపర్‌స్టార్‌ అంటే ఆయనే అని అందరి నోటా అనిపించేలా చేస్తున్నారు. ఎవరి నోట విన్నా ఇదే మాట. ‘2.0’ గురించిన చర్చే. అవును మరి దాదాపు 500 కోట్ల బడ్జెట్‌ అంటే మామూలు విషయం కాదు.

మొత్తానికి తమిళ తంబీలు తలైవాపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. ‘2.0’ రికార్డుల మోత మొదలైంది. భారీ ఓపెనింగ్స్‌ అందుకుంటోంది. ఫస్ట్‌ షోతోనే బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ అందుకుంది. ఎక్కడా ఒక్క నెగిటివ్‌ రివ్యూ కానీ, నెగిటివ్‌ కామెంట్‌ కానీ రావట్లేదీ సినిమాకి. వయసు మీద పడినా రజనీ కాంత్‌లో ఎక్కడా ఎనర్జీ లెవల్స్‌ డ్రాప్‌ కాలేదనే అంటున్నారు ఈ సినిమా చూసిన వారంతా. చూసిన వారు చూసినట్లు ఊరుకోకుండా, సినిమా చాలా బాగుంది. అద్భుత కావ్యం. విజువల్‌ వండర్‌ అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

పిల్లలూ, పెద్దలూ అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ‘రోబో 2.0’ అంటూ విమర్శకులు సైతం ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు. మొత్తానికి అంచనాల్ని అందుకునేలా శంకర్‌ తానేంటో నిరూపించుకున్నాడు 2.0తో. ఇక రికార్డులు మొదలయ్యాయ్‌. ఎన్నెన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలిక.

You May Like This
- Advertisment -spot_img

Most Popular