HomeMovie News Teluguనందమూరి తారకరత్న ఎంట్రీ అదిరింది గురూ.!

నందమూరి తారకరత్న ఎంట్రీ అదిరింది గురూ.!

తెలంగాణలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. తెలుగు దేశం పార్టీ తరపున సినీ గ్లామర్‌ ఎక్కువగా కనిపిస్తోంది. స్వర్గీయ నందమూరి హరికృష్ణ కుమార్తై సుహాసిని కూకట్‌పల్లి నుండి పోటీ చేస్తుండడంతో ఆమెకు మద్దతుగా నందమూరి కుటుంబసభ్యులు ప్రచార రంగంలోకి దిగారు. నామినేషన్‌ ఎపిసోడ్‌కి బాలకృష్ణ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. తాజాగా సోదరి తరపున ప్రచారం చేశాడు నందమూరి తారకరత్న. తారకరత్న ప్రచారానికి మంచి స్పందన లభించింది.

కాంగ్రెస్‌, తెలుగుదేశం, తెలంగాణా జన సమితి పార్టీల తరపున కార్యకర్తలు తారకరత్న వెంట కనిపించారు. దాంతో తారకరత్న టూర్‌ సందడిగా మారింది. ప్రచారం సందర్భంగా ప్రజలతో అక్కడక్కడా మమేకమయ్యాడు తారకరత్న. తెలుగుదేశం పార్టీకి ఓటెయ్యాలని అభ్యర్ధిస్తూ తారకరత్న సందడి చేస్తుంటే, ఆయనను చూసేందుకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పోటెత్తారు. తారకరత్నతో సెల్ఫీలు దిగాలనీ, కరచాలనం చేయాలనీ, మాట్లాడాలనీ కొన్ని చోట్ల జనం ఆశక్తి చూపారు.

అభిమానుల తాకిడి ఎక్కువవడంతో బౌన్సర్లు కష్టపడాల్సి వచ్చింది. టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం తారకరత్నకు కొత్త కాదు. గతంలో కూడా టీడీపీ గెలుపు కోసం తారకరత్న కృషి చేశాడు. ప్రస్తుతం తారకరత్న సినిమాలు తగ్గించాడు. ఈ మధ్య నెగిటివ్‌ రోల్స్‌ని సైతం తారకరత్న సై అంటోన్న సంగతి తెలిసిందే.

You May Like This
- Advertisment -spot_img

Most Popular