HomeMovie News Teluguకౌశల్‌ ఇన్‌ - నాని బతికిపోయాడు!

కౌశల్‌ ఇన్‌ – నాని బతికిపోయాడు!

బిగ్‌ బాస్‌ రియాల్టీ షో రెండో సీజన్‌ ఎన్నో వివాదాల నడుమ కొనసాగుతోంది. ప్రధానంగా కౌశల్‌ ఆర్మీ, బిగ్‌ బాస్‌ రియాల్టీ షోకి విపరీతంగా హైప్‌ తీసుకురావడమే కాక, షోని వివాదాల్లోకి నెట్టేస్తున్న సంగతి తెల్సిందే. 

సీజన్‌ టూ బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో హౌస్‌మేట్స్‌ కూడా కౌశల్‌ని ‘కార్నర్‌’ చేయడమే పనిగా పెట్టుకోవడమూ వివాదాలకు కారణమే. హౌస్‌మేట్స్‌ అందరూ ఓ వైపు, కౌశల్‌ మాత్రమే ఇంకో వైపు అన్నట్టుగా సాగుతోంది. హోస్ట్‌గా నాని కూడా, మెజార్టీ వైపే మొగ్గు చూపుతున్నాడనే విమర్శలున్నాయి. నిన్నటి వీకెండ్‌ షోలో, కౌశల్‌ ఎలిమినేట్‌ అవుతాడని కొందరు కౌశల్‌ అభిమానులు ఆందోళన చెందారు. కౌశల్‌ వ్యతిరేకులు ఆనందపడ్డారు. అయితే అవేవీ జరగలేదు.  

కౌశల్‌ సేఫ్‌ జోన్‌లోకి వెళ్ళగా, అమిత్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. ఐదారు వారాలుగా అమిత్‌ సేఫ్‌ జోన్‌లోకి వెళుతూ వుండడానికి అనేక కారణాలున్నాయి. కమల్‌హాసన్‌తో అమిత్‌కి నామినేషన్‌ నుంచి వెసులుబాటు కల్పించడమే కాకుండా, ఆ తర్వాత గణేష్‌, శ్యామల, నూతన్‌నాయుడులను అమిత్‌ కోసం బలిచేశారన్న విమర్శలొచ్చాయి. ఎట్టకేలకు అమిత్‌ని షో నుంచి బయటకు పంపక తప్పలేదు. 

ఒకవేళ కౌశల్‌ గనుక నిన్న ఎలిమినేట్‌ అయి వుంటే, హోస్ట్‌ నాని ఇంటి ముందు ధర్నా చేయాలని కౌశల్‌ ఆర్మీ తరఫున కొందరు సోషల్‌ మీడియాలో ప్లానింగ్స్‌ రెడీ చేసుకున్నారు. అది జరిగేనో లేదోగానీ, నానిపై కౌశల్‌ ఆర్మీకి కొంత ‘కసి’ చల్లారినట్లయ్యింది కౌశల్‌ సేఫ్‌ అవడంతో. ఇది జస్ట్‌ రియాల్టీ షో, గేమ్‌ షో అని తెలిసినా, ఏంటో ఇంత రచ్చ ఈ షో చుట్టూ!

You May Like This
- Advertisment -spot_img

Most Popular