HomeMovie News Teluguలీకులు బాబోయ్‌ లీకులు.. విలపిస్తోన్న సూపర్‌ స్టార్‌

లీకులు బాబోయ్‌ లీకులు.. విలపిస్తోన్న సూపర్‌ స్టార్‌

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తాజా చిత్రం ‘2.0’ లీకులతో విలవిల్లాడుతోంది. భారీ అంచనాలతో ఈ సినిమా రూపొందింది. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న సినిమాగా ‘2.0’ గురించి ప్రచారం జరుగుతోంటే, సినిమా విడుదల విషయంలో మాత్రం చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది.  గత ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమా ఎలాగోలా ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతుండగా, సినిమాని లీకుల బెడద వెంటాడుతోంది. 

తాజాగా ‘2.0’ సినిమాకి సంబంధించిన కొన్ని విజువల్స్‌ ఇంటర్నెట్‌లో లీక్‌ అయ్యాయి. ఎవరు వీటిని లీక్‌ చేశారో తెలియదుగానీ, లీక్‌ అయిన వీడియోలు మాత్రం వైరల్‌గా మారాయి. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో ‘2.0’ ఉండబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాకి అదనపు సాంకేతిక హంగులు అద్దేందుకు చిత్ర దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అలా సినిమా సాంకేతిక మెరుగులు దిద్దుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఆ తరహా టెక్నాలజీ అందిస్తున్నవారే వీడియోల్ని లీక్‌ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇంకో వైపున ఇదంతా ‘2.0’ ప్రమోషన్‌ స్ట్రేటజీ అని కూడా ఊహాగానాలు వినవస్తున్నాయి. ఏది నిజమోగానీ, తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మాత్రం ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్న దరిమిలా, లీకులు ఆయన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పక తప్పదు. 

శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ నెగెటివ్‌ రోల్‌లో కన్పించబోతున్న సంగతి తెలిసినదే.

You May Like This
- Advertisment -spot_img

Most Popular