HomeMovie News Teluguనాని Vs విజయ్ దేవరకొండ

నాని Vs విజయ్ దేవరకొండ

సినీ పరిశ్రమ లో ప్రతి శుక్రవారం అన్నీ తారుమారు అయిపోతుంటాయి. ఒక హిట్ అలాగే ఒక ఫ్లాప్ తో మారిపోయే పరిస్థితులు ఉన్న నేపధ్యంలో తాము చేసే ప్రతి సినిమాలో అభినయంతో పాటుగా సదరు చిత్రం విజయం కూడా లెక్కలోకి వస్తుంది.

ఇక విషయానికి వస్తే, నాని చాలా చిన్న హీరోగా మొదలై ప్రస్తుతం ప్రతిష్టాత్మక బిగ్ బాస్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించే వరకు వచ్చాడు. ఈ ప్రయాణంలో తాను ఒక స్టార్ స్టేటస్ ని సంపాదించుకోగలిగాడు, అదే సమయంలో ఒక చక్కటి సహజ నటుడు అన్న ట్యాగ్ ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇప్పుడు ఈ స్థానంలోకి యువ హీరో విజయ్ దేవరకొండ వచ్చేశాడు అన్న అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తపరుస్తున్నారు. మొదటి చిత్రం నుండే ఒక వైవిధ్య నటుడిగా తనని తాను నిరూపించుకుంటూ తన అసాధారణ నటనతో మనమధ్యలో ఉన్న ఒక అబ్బాయి అన్న భావన మనకి కలిగించగలిగాడు.

ఇక వరుస హిట్స్ తో యువ హీరో నుండి స్టార్ హీరో స్టేటస్ సంపాదించేసుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 3కి హోస్ట్ గా కూడా విజయ్ కనిపించబోతున్నాడు అన్న రూమర్స్ మొదలైపోయాయి. ఈ తరుణంలో ఇండస్ట్రీ లో నాని స్థానానికి చెక్ పెట్టేసాడు విజయ్ అన్న టాక్ మొదలైంది.

అయితే సినీ పరిశ్రమలో ఇద్దరు హీరోల మధ్య ఆరోగ్యకర పోటీ ఉండడం చాలా మంచిది అన్న అభిప్రాయం ఇండస్ట్రీ వైపు నుండి వస్తున్నది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular