HomeMovie News Teluguబిగ్‌బాస్‌-2: టాప్‌ 5లో వుండేదెవరు?

బిగ్‌బాస్‌-2: టాప్‌ 5లో వుండేదెవరు?

ఎప్పుడన్నా ఏదన్నా జరగొచ్చు.. ఇంకొంచెం మసాలా.. అంటూ ఎప్పటికప్పుడు బిగ్‌బాస్‌ రియాల్టీ షో సీజన్‌ 2లో హల్‌చల్‌ చేసేస్తున్నాడు హోస్ట్‌గా నేచురల్‌ స్టార్‌ నాని. వీకెండ్‌ వస్తోందంటే, ఎవరి వికెట్‌ పడిపోతుందన్న టెన్షన్‌ బుల్లితెర వీక్షకుల్లో నెలకొంది. నిన్నటి వీకెండ్‌తో టాప్‌ 5లో ఎవరుంటారు? అనేదానిపై ఓ పిక్చర్‌ వచ్చేసిందని అంటున్నారు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 షో వీక్షకులు. 

ఖచ్చితంగా టాప్‌ 5లో గణేష్‌ వుంటాడట. మామూలుగా అయితే గణేష్‌ ఎప్పుడో ఔట్‌ అయిపోవాల్సి వుంది. ‘సామాన్యుడు’ అనే కేటగిరీలో వచ్చిన నూతన్‌ నాయుడు వికెట్‌ పడిపోవడం, సంజన ఔట్‌ అయిపోవడంతో ఈ అభిప్రాయం కలగడం సహజమే. దాంతో గణేష్‌ని ఎలిమినేషన్‌ నుంచి ప్రతిసారీ బిగ్‌ హౌస్‌ రక్షిస్తూ వస్తోంది. షోలో గణేష్‌ యాక్టివ్‌గా కన్పించకపోవడం చూస్తే, అతనికి ఓట్లు తక్కువగా పడాలనిపిస్తుంది. కానీ అలా జరగకపోవడం శోచనీయం. 

ఇదిలా ఉండగా, నిన్న ఎలిమినేట్‌ అయిన భాను శ్రీ, బిగ్‌ బాస్‌ రియాల్టీ షో చాలా బాగా జరుగుతోందనీ, ఇక్కడ మానిప్యులేషన్‌కి ఛాన్స్‌ లేదనీ, చాలా ఫెయిర్‌గానే అంతా నడుస్తోందని చెప్పడం గమనించాల్సిన విషయమే. బాబు గోగినేని, కౌషల్‌, సామ్రాట్‌, తేజస్వి, గణేష్‌ టాప్‌ 5లో వుంటారని అందరూ అంచనా వేస్తుండగా, దీప్తికీ ఎక్కువ మంది అభిమానులు ఉన్నారండోయ్‌. కాబట్టి, ఆమెనీ లైట్‌ తీసుకోలేం. బిగ్‌ బాస్‌ రియాల్టీ షోలో ఏదైనా జరగొచ్చు. 

తనీష్‌ కావొచ్చు, దీప్తి సునయన కావొచ్చు.. వీరూ బిగ్‌ బాస్‌ సీజన్‌ టూ టాప్‌ ఫైవ్‌లో వున్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular