HomeMovie News Teluguఅప్పుడు 'అర్జున్‌రెడ్డి' ఇప్పుడు 'ఆరెఎక్స్‌ 100'

అప్పుడు ‘అర్జున్‌రెడ్డి’ ఇప్పుడు ‘ఆరెఎక్స్‌ 100’

సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం ఏ స్థాయిలో సెన్సేషన్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లో బడ్జెట్‌తో రూపొంది, హయ్యెస్ట్‌ కలెక్షన్స్‌ రాబట్టి, విమర్శకుల ప్రశంసలు అందుకుందీ సినిమా. యూత్‌పై ఈ సినిమా వేసిన స్టాంప్‌ అంతా ఇంతా కాదు. యూత్‌కి కనెక్ట్‌ అయిన ఓ మోస్తరు సినిమా ఏదైనా కానీ దాన్ని ఇమ్మీడియట్‌గా ‘అర్జున్‌రెడ్డి’తో పోల్చేస్తున్నారు. 

తాజాగా ఈ స్థాయిలో పాపులర్‌ అయిన సినిమా ‘ఆర్‌ఎక్స్‌ 100’. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. కలెక్షన్స్‌ వైజ్‌ రాకెట్‌ స్పీడులో దూసుకెళ్తోందీ సినిమా. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడు అజయ్‌ భూపతి ఈ సినిమాని తెరకెక్కించాడు. లోబడ్జెట్‌తో ఇన్‌క్రెడిబుల్‌ లవ్‌ స్టోరీ అనే క్యాప్షన్‌తో అజయ్‌ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దర్శకుడిగా సినిమా టేకింగ్‌ చాలా బావుందని సినీ ప్రముఖులు అజయ్‌ భూపతిని ప్రశంసిస్తున్నారు. 

‘అర్జున్‌రెడ్డి’ సినిమా అంత పాపులర్‌ కావడానికి కారణం ఆ సినిమాలోని హీరో, హీరోయిన్స్‌ మధ్య రొమాంటిక్‌ సీన్స్‌, ముఖ్యంగా లిప్‌లాక్‌ సీన్సే అని ఒప్పుకుని తీరాల్సిందే. ఇంచుమించు అదే రేంజ్‌ అనాలో, అంతకు మించి అనాలో కానీ ‘ఆర్‌ ఎక్స్‌ 100’కు కూడా ఇదే పబ్లిసిటీ పాయింట్‌ అయ్యింది. యూత్‌ని ఎక్కువగా ఎట్రాక్ట్‌ చేయడమంటే, ఈ తరహా హాట్‌ సీన్సే కారణమంటున్నారు. అయితే హాట్‌ సీన్స్‌తో పాటు, కంటెన్ట్‌ కూడా పవర్‌ఫుల్‌గా ఉండడంతో బాక్సాఫీస్‌ వద్ద బాగానే నిలదొక్కుకుందీ సినిమా. 

అందుకే శిష్యుడైన అజయ్‌ భూపతికి రామ్‌గోపాల్‌ వర్మ స్వయంగా ఫోన్‌ చేసి, తన తర్వాతి సినిమాకు అసిస్టెంట్‌గా ఉండే ఛాన్స్‌ ఇవ్వమన్నాడు. దటీజ్‌ ది ప్రెజెంట్‌ స్టామినా ఆఫ్‌ ‘ఆర్‌ఎక్స్‌ 100’.

You May Like This
- Advertisment -spot_img

Most Popular