HomeMovie News Teluguపాపం నాని ఎంత బిజీనో కదా.!

పాపం నాని ఎంత బిజీనో కదా.!

ఓ పక్క సినిమాలూ, మరోపక్క ‘బిగ్‌బాస్‌’తో ఫుల్‌ బిజీగా ఉన్నాడు నేచురల్‌ స్టార్‌ నాని. కాస్త టైం దొరికినా కాస్సేపు ఫ్యామిలీతో కాలక్షేపం చేసే నాని ఇప్పుడు ‘బిగ్‌బాస్‌’ షోని పదే పదే చూడడం. కంటెస్టెంట్స్‌ బిహేవియర్‌ని అబ్జర్వ్‌ చేయడం, వారి వారి క్యారెక్టర్స్‌ని విశ్లేషించుకోవడం చేస్తుండడంతో అస్సలు టైమే దొరకడం లేదట. తాజాగా సోషల్‌ మీడియాలో నాని ఓ పోస్ట్‌ పెట్టాడు.

తనకు రెండే రెండు సినిమాలు చూడాలనుందని. బాలీవుడ్‌లో సంజయ్‌దత్‌ బయోపిక్‌గా తెరకెక్కుతోన్న ‘సంజూ’ సినిమాపై ఆశక్తికరమైన చర్చ జరుగుతోంది. అందుకే ఆ సినిమా చూడాలని తనకూ ఆతృతగా ఉందని అంటున్నాడు నాని. అలాగే తరుణ్‌ భాస్కర్‌ సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోందంటున్నాడు. వీలైతే వీకెండ్‌లో ఈ రెండు సినిమాలు చూస్తానని నాని పేర్కొన్నాడు.

అయితే వీకెండ్‌లో నాని బుల్లితెరపై సందడి చేయాలి కదా బిగ్‌బాస్‌ హోస్ట్‌గా. ఈ వీకెండ్‌ బిగ్‌బాస్‌కి ఎంతో కీలకం కూడా. ఎలిమినేషన్‌లో బిగ్‌బాస్‌ టీమ్‌ వివక్ష చూపిÄస్తోందనీ, సామాన్యులనే టార్గెట్‌ చేస్తోందనీ టాక్‌ బాగా వినిపిస్తోంది. మరి ఈ టాక్‌కి ఈ వీక్‌ ఎలిమినేషన్‌ బలం చేకూరుస్తుందా? చూడాల్సి ఉంది. ఇకపోతే బిగ్‌ హౌస్‌లో కంటెస్టెంట్స్‌ తమదైన శైలిలో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు.

లేటెస్టుగా బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా ‘లైఫ్‌లో ఎవరికోసమైనా ఏమైనా త్యాగం చేశారా?’ అనే టాపిక్‌కి సంబంధించి కంటెస్టెంట్స్‌ తమ తమ పర్సనల్‌ ఇష్యూస్‌ని ఆడియన్స్‌తో షేర్‌ చేసుకున్న విధానం బుల్లితెర ప్రేక్షకుల మనసుల్ని ఎక్కడో టచ్‌ చేసింది. ఈ టాస్క్‌తో హౌస్‌మేట్స్‌, ఆడియన్స్‌కి మరింత దగ్గరైపోయారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular