HomeMovie News Teluguవిజయ్‌ దేవరకొండ మామూలోడు కాదండోయ్‌.!

విజయ్‌ దేవరకొండ మామూలోడు కాదండోయ్‌.!

ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే, మరోపక్క గెస్ట్‌ రోల్స్‌తోనూ ఆకట్టుకుంటున్నాడు యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. ఒక్క సినిమాతోనే సెన్సేషనల్‌ హీరో అనిపించుకున్న విజయ్‌ దేవరకొండను పలువురు దర్శక నిర్మాతలు వరుసగా లైన్‌లో పెట్టేశారు. 

ప్రస్తుతం మనోడి చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. చర్చల దశలో మరిన్ని సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమాలన్నీ ఎప్పుడు విడుదలవుతాయి అనే విషయం పక్కన పెడితే, మనోడు అస్సలు ఖాళీగా ఉండేందుకు ఇష్టపడడట. అందుకే సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ప్రైవేట్‌ వీడియో సాంగ్స్‌లోనూ నటించేందుకు సై అంటున్నాడు. 

తాజాగా ఓ వీడియో సాంగ్‌ కోసం విజయ్‌ దేవరకొండను సంప్రదించారట ఓ టీమ్‌. ఆ సాంగ్‌ థీమ్‌ నచ్చిన విజయ్‌ దేవరకొండ వెంటనే సై అన్నాడట. ఈ సాంగ్‌లో విజయ్‌ దేవరకొండ సరసన ఓ బెంగాలీ అమ్మాయి జత కడుతోందట. గతంలో ఇలాంటి వీడియో సాంగ్స్‌లో నటించిన అనుభవం ఉన్న మలోబికా బెనర్జీ ఈ వీడియో సాంగ్‌లో నటిస్తోంది. 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలా తెలుగులో ఇంతవరకూ ప్రైవేట్‌ వీడియో సాంగ్స్‌లో నటించిన హీరోలు లేరట. ఆ ట్రెండ్‌ మనోడే స్టార్ట్‌ చేశాడట. అంతేగా మనోడు ఏం చేసినా ట్రెండ్‌ అయ్యి కూర్చుంటోంది. యూత్‌లో అసలే బోలెడంత క్రేజ్‌ ఉన్న హీరో వీడియో సాంగ్‌ అంటే, ఆ సాంగ్‌కి ఇంకెంత క్రేజ్‌ వచ్చేస్తుందో చూడాలిక.

You May Like This
- Advertisment -spot_img

Most Popular