HomeMovie News Teluguవారిద్దరి డేటింగ్‌ అలా ముగిసింది

వారిద్దరి డేటింగ్‌ అలా ముగిసింది

దిశా పటానీ – టైగర్‌ ష్రాఫ్‌ వీరిద్దరి మధ్యా లవ్‌ ఎఫైర్‌ పెళ్లి దాకా వెళ్లింది. ప్రేమ పేరు చెప్పి, హాట్‌ హాట్‌ వెకేషన్స్‌ని ఎంజయాన చేస్తూ, ఆ వెకేషన్‌కి సంబంధించిన ఫోటోలను నెట్‌లో పోస్ట్‌ చేసి, మరీ సందడి చేసింది ఈ జంట. ఈ ప్రేమ కాస్తా ముదిరి పాకాన పడి రేపో మాపో పెళ్లి అన్నాక తుస్‌ మనిపించేశారు. పరస్పర అవగాహనతో పెళ్లి ఆలోచనను పక్కన పడేశారీ హాట్‌ హాట్‌ జంట. 

ఇదిలా ఉంటే, ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో టైగర్‌ ష్రాఫ్‌తో ప్రేమ సంగతి ఏంటని ముద్దుగుమ్మ దిశాపటానీని అడిగితే, ‘ప్రేమా.? అదేంటీ.? అసలు మా ఇద్దరి మధ్యా ప్రేమే లేదు. మేమిద్దరం జస్ట్‌ ఫ్రెండ్స్‌ అంతే..’ అని సింపుల్‌గా సమాధానమిచ్చేసింది ముద్దుగుమ్మ దిశా పటానీ. అంటే డేటింగ్‌ ముగిసింది. అదిప్పుడు జస్ట్‌ ఫ్రెండ్‌షిప్‌ అయ్యిందన్న మాట.. అని మనం భావించాలి. 

ప్రస్తుతం దిశాపటానీ ఇటు సౌత్‌ సినిమాలతోనూ, అటు హిందీ సినిమాలతోనూ ఫుల్‌ బిజీగా ఉంది. తమిళంలో ‘సంఘమిత్ర’ అనే ఓ పీరియాడిక్‌ చిత్రంలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో ‘బాఘీ 2’ చిత్రం తర్వాత తాజాగా కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌తో ఓ సినిమాలోనూ, గ్రీకువీరుడు హృతిక్‌ రోషన్‌తో ఓ సినిమాలోనూ నటిస్తోంది. 

తెలుగులో ఆల్రెడీ ‘లోఫర్‌’ సినిమాలో మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ సరసన నటించేసింది. ఈ సినిమా ఆశించిన రిజల్ట్‌ అందుకోకపోవడంతో, ఇక్కడ దుకాణం కట్టేసి, బాలీవుడ్‌లో పాగా వేసేసింది. అక్కడ వరుసగా స్టార్‌ హీరోలతో సినిమాలు ఒప్పుకుంటోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular