HomeMovie News Teluguరేణుదేశాయ్‌ కాబోయే భర్త ఎవరో!

రేణుదేశాయ్‌ కాబోయే భర్త ఎవరో!

రేణు దేశాయ్‌ పెళ్ళిపీటలెక్కుతోంది. ‘బద్రి’, ‘జానీ’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన రేణుదేశాయ్‌, కొంతకాలం పవర్‌ స్టార్‌ పవన్‌కళ్యాణ్‌తో సహజీవనం చేసి, ఆ తర్వాత ఆయన్ని పెళ్ళాడిన సంగతి తెల్సిందే. రేణు, పవన్‌ దంపతులకు అకిరా, ఆద్య సంతానం. ప్రస్తుతం అకిరా, ఆద్య తమ తల్లి రేణుదేశాయ్‌ దగ్గరే వుంటున్నారు. పూణేలో విద్యనభ్యసిస్తున్నాడు అకిరా. 

ఇటీవల పవన్‌కళ్యాణ్‌, విజయవాడ వెళ్ళినప్పుడు, ఆయన వెంటే కన్పించాడు అకిరా. ఇంకో వైపున రేణుదేశాయ్‌, పవన్‌కళ్యాణ్‌ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలం ఒంటరిగానే జీవితం గడిపింది. తాజాగా, తన జీవితాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి దొరకడంతో, అతన్ని పెళ్ళాడాలని నిర్ణయించుకుంది. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ తాజాగా జరిగింది. 

తన ఎంగేజ్‌మెంట్‌ విశేషాల్ని సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంది రేణు దేశాయ్‌. అయితే కాబోయే భర్త ఎవరన్నది మాత్రం చెప్పలేదు. ఎంగేజ్‌మెంట్‌ సందర్భంగా ఆద్య, అకిరా – రేణుదేశాయ్‌తోనే వున్నారు. త్వరలోనే తనకు కాబోయే భర్తకు సంబంధించిన వివరాల్ని రేణుదేశాయ్‌ వెల్లడించనున్నట్లు సమాచారమ్‌. 

రేణుదేశాయ్‌తో విడాకుల తర్వాత పవన్‌కళ్యాణ్‌, అన్నా లెజ్‌నెవా అనే రష్యన్‌ మహిళను వివాహమాడిన సంగతి తెలిసిందే. అన్నా లెజ్‌నెవా – పవన్‌కళ్యాణ్‌లకు ఇటీవలే ఓ మగబిడ్డ జన్మించాడు. ఆ చిన్నారికి మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ అని పేరు పెట్టారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular