HomeMovie News Teluguపెళ్లి పీటలెక్కనున్న ప్రియాంకా చోప్రా.?

పెళ్లి పీటలెక్కనున్న ప్రియాంకా చోప్రా.?

బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా పెళ్లి పీటలెక్కబోతోంది. ప్రస్తుతానికి పెళ్లి విషయంలో కొంతం కన్ఫ్యూజన్‌ ఉన్నా, ఆ దిశగానే సంకేతాలు పంపుతోంది. అమెరికాలో ఈ మధ్య ప్రియాంకా చోప్రా ప్రేమాయణం జోరుగా నడిచింది. ఎక్కడ చూసినా ఈ జంటే, చెట్టాపట్టాలేసుకుని కెమెరాలకు చిక్కింది. 

తాజాగా ఈ జంట తమ ప్రేమ విడిదిని ముంబయ్‌కి షిఫ్ట్‌ చేసింది. అమెరికన్‌ సింగర్‌ నిక్‌జోనార్స్‌ని ప్రియాంకా తన కుటుంబ సభ్యులకు, అత్యంత సన్నిహితులకు పరిచయం చేసింది. అతి త్వరలో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరగనుంది. ఎంగేజ్‌మెంట్‌ కోసం వీరిద్దరూ ముంబయ్‌కి వచ్చినట్లు సమాచారమ్‌. 

ఈ మధ్య హాలీవుడ్‌లో బిజీగా గడిపింది ప్రియాంకా చోప్రా. ‘బేవాచ్‌’ అనే సినిమాలో నటించింది. ‘క్వాంటికో’ టీవీ సిరీస్‌లో కనిపించింది. ఆ క్రమంలోనే అమెరికన్‌ సింగర్‌ అయిన నిక్‌జోనార్స్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఇకపోతే త్వరలోనే ప్రియాంకా తన ప్రియుడిని పెళ్లాడబోతోందని తెలుస్తోంది. 

అయితే పెళ్లి తర్వాత ప్రియాంకా సినిమాల్లో నటిస్తుందా? అంటే చాలా సింపుల్‌. ఇప్పుడు హీరోయిన్స్‌ కెరీర్‌కి పెళ్లి అస్సలు అడ్డంకి కాదు. పెళ్లయిన తర్వాత కూడా అంతకు ముందులాగే బిజీగా కెరీర్‌ని సాగిస్తున్నారు అందాల భామలు. అలాగే ప్రియాంకా కూడా. హాలీవుడ్‌ నుండి తిరిగొచ్చిన ప్రియాంకా ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌ సినిమాలతో బిజీ అవుతోంది. 

ఇక త్వరలో పెళ్లి చేసుకుని కూడా తన కెరీర్‌ని ఇంతే బిజీగా గడిపేలా ఉంది ప్రియాంకా చోప్రా.

You May Like This
- Advertisment -spot_img

Most Popular