HomeMovie News Teluguక్యూట్‌ అండ్‌ రొమాంటిక్‌ 'గీత గోవిందం'

క్యూట్‌ అండ్‌ రొమాంటిక్‌ ‘గీత గోవిందం’

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ తాజా చిత్రం ‘గీత గోవిందం’ ఇప్పుడు సరికొత్త ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తున్న సినిమా. పరశురామ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ తాజాగా విడుదలైంది. ఈ ఫస్ట్‌లుక్‌కి రెస్పాన్స్‌ అదిరిపోతోంది. 

విజయ్‌ దేవరకొండ కాళ్లు గోడకి తన్నిపెట్టి కూర్చొనగా, తన కాళ్లపై హీరోయిన్‌ కూర్చొని ఒళ్లు విరుచుకున్నట్లుగా ఉందీ లుక్‌. చిన్న గౌను వేసుకుని క్యూట్‌గా ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? రష్మికా మండన్నా. అవును ‘ఛలో’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు విజయ్‌ దేవరకొండతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌కి రెడీ అవుతోంది. ‘శ్రీరస్తు శుభమస్తు’ అనే ట్రెడిషనల్‌ టైటిల్‌తో అల్లు వారబ్బాయి అల్లు శిరీష్‌తో మంచి విజయం అందుకున్న డైరెక్టర్‌ పరశురామ్‌. 

తాజా సినిమా ఫస్ట్‌లుక్‌తోనే ఆశక్తి పెంచేస్తున్నాడు. బన్నీ వాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీసుందర్‌ ఆహ్లాదమైన మ్యూజిక్‌ అందిస్తున్నారు. క్యూట్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఆల్రెడీ యూత్‌లో విజయ్‌ దేవరకొండ, రష్మికా మండన్నా ఇద్దరికీ మంచి క్రేజ్‌ ఉంది. ఆ క్రేజ్‌ని మరింత రెట్టింపు చేసేలా ఈ సినిమా ఉండబోతోందని ఫస్ట్‌లుక్‌ ద్వారా అర్ధమైపోతోంది. 

మరోవైపు విజయ్‌ దేవరకొండ ఈ సినిమాతో పాటు, ‘ఏ మంత్రం వేశావె’, ‘నోటా’, ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే ‘మహానటి’తో విజయ్‌దేవరకొండ మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular