HomeMovie News Teluguచందమామ హాట్‌ కిస్‌ ఎవరికో తెలుసా?

చందమామ హాట్‌ కిస్‌ ఎవరికో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్‌ కుటుంబంలో 7.1 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు బ్యూటీ చందమామకి. అందుకే వారందరికీ చందమామ గట్టి కిస్‌ ఇచ్చింది. ఫోటో చూస్తున్నారుగా, ఎంత ప్రేమగా ఇచ్చిందో ముద్దు. సోసల్‌ మీడియాలో ఈ ఫోటో ఇప్పుడు వైరల్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలో కాజల్‌ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. 

ట్విట్టర్‌లో ఆమెకు 1.6 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 7.1 మిలియన్స్‌కి చేరింది ఆ ఫాలోవర్స్‌ సంఖ్య. అందుకే అందాల కాజల్‌ తన ఫాలోవర్స్‌ అందరికీ ఇదిగో ఇలాంటి ట్వీట్‌ ఇచ్చింది. ఇది చాలా రేర్‌ ట్వీట్‌ కదా. సినిమా ముచ్చట్లతో పాటు, సామాజిక అంశాలపై కూడా ఎప్పటికప్పుడు, సందర్భానుచితంగా స్పందించడం కాజల్‌కి అలవాటు. కాజల్‌కి తెలుగులోనే కాదు, తమిళంలో కూడా ఫ్యాన్స్‌ ఉన్నారు. తెలుగుతో పాటు, తమిళంలోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది కాజల్‌ అగర్వాల్‌. 

మొన్నీమధ్యనే కళ్యాణ్‌రామ్‌తో ‘ఎమ్మెల్యే’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం కాజల్‌ తెలుగులో యంగ్‌ హీరో శర్వానంద్‌తో ఓ చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘క్వీన్‌’ తమిళ రీమేక్‌లో కాజల్‌ నటిస్తోంది. ఇటు యంగ్‌ హీరోస్‌తోనూ, అటు సీనియర్‌ హీరోస్‌తోనూ ఏకకాలంలో కలిసి నటిస్తోంది కాజల్‌. దాదాపు దశాబ్ధకాలం పైగానే తన అందంతో అభిమానుల్ని అలరిస్తోంది ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌. అలాంటిది ఆ స్థాయిలో ఫాలోవర్స్‌ ఉండరా మరి.!

You May Like This
- Advertisment -spot_img

Most Popular