HomeMovie News Teluguసిక్స్‌ ప్యాక్‌లో విజయ్‌ దేవరకొండ

సిక్స్‌ ప్యాక్‌లో విజయ్‌ దేవరకొండ

సంచలన హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సీవాలా’. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. 

కండలు తిరిగిన బాడీతో సిక్స్‌ ప్యాక్‌లో విజయ్‌ దేవరకొండ వెనక్కి తిరిగి ఉన్న పోస్టర్‌ అది. విజయ్‌ దేన్నో బలంగా పట్టుకుని పైకి ఎక్కుతుండగా, అతన్ని పట్టుకుని హీరోయిన్‌ ఉన్నట్లుగా ఉంది ఈ పోస్టర్‌. గతంలో పొగలు కక్కే కారు పోస్టర్‌ని విడుదల చేశారు. ఆ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది అప్పట్లో. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ సిక్స్‌ ప్యాక్‌కీ రెస్పాన్స్‌ అదిరిపోతోంది. ఈ సినిమాలో విజయ్‌కి జంటగా ముద్దుగుమ్మ ప్రియాంకా జవాల్కర్‌ నటిస్తోంది.

కొత్తమ్మాయిల్ని పరిచయం చేయడంలో విజయ్‌ దేవరకొండ ముందుంటాడు. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో షాలినీ పాండేని పరిచయం చేశాడు. ఆ సినిమా తర్వాత అమ్మడు తెగ పాపులర్‌ అయిపోయింది. వరుస సినిమాల్లో, అందులోనూ ప్రెస్టీజియస్‌ మూవీస్‌లో అవకాశాలు దక్కించుకుంటోంది ఈ బ్యూటీ. అలాగే ప్రియాంక దశ కూడా తిరుగుతుందేమో చూడాలి మరి. 

రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎస్‌.కె.యన్‌. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరో పక్క విజయ్‌ దేవరకొండ కీలక పాత్రలో నటించిన ‘మహానటి’ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular