HomeHomeఅచ్చంగా మహానటి సావిత్రిలా.!

అచ్చంగా మహానటి సావిత్రిలా.!

యంగ్‌ హీరోయిన్‌ కీర్తి సురేష్‌కి అగ్నిపరీక్ష ఇది. అదే మహానటి సావిత్రి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ‘మహానటి’ చిత్రం. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ సావిత్రి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రకు ఆమెను ఎంచుకున్నందుకు చాలా విమర్శలు వచ్చాయి ఇప్పటికే. కానీ ఆమె మాత్రం ఈ ప్రాజెక్ట్‌ని చాలా చాలా జాగ్రత్తగా తీసుకుందట. 

సావిత్రిలా తనను తాను మలచుకునేందుకు అలనాటి మేటి నటి సావిత్రి నటించిన చాలా సినిమాలు చూసిందట. అయినా గెటప్‌దేముంది. ఎలాగైనా మార్చుకోవచ్చు. గెటప్‌ గురించి కాదు, ఆమెలా నటించేందుకు పరకాయ ప్రవేశం చేసినంత పని చేశానంటోంది కీర్తి సురేష్‌. తాజాగా ఆమె సావిత్రి గెటప్‌లో ఉన్న ఫోటో ఒకటి రిలీజ్‌ చేస్తూ, ఈ రోజు సాయంత్రం ‘మహానటి’ టీజర్‌ రాబోతోందని ప్రకటించింది చిత్ర యూనిట్‌. ఈ పోస్టర్‌ చూస్తుంటే, అచ్చం సావిత్రిలానే అనిపిస్తోంది కీర్తి సురేష్‌. 

ఈ సినిమాలో చాలా మంది ప్రముఖ నటులు నటిస్తున్నారు. సమంత, ప్రకాష్‌ రాజ్‌, సీనియర్‌ నటుడు మోహన్‌బాబు, యంగ్‌స్టర్‌ విజయ్‌ దేవరకొండ, షాలినీ పాండే, దుల్కర్‌ సల్మాన్‌ తదితర ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి నాగ్‌ అశ్శిన్‌ దర్శకత్వం వహించాడు. ‘దర్శిని’ పేరుతో ఈ రోజు సాయంత్రం ఈ చిత్రం టీజర్‌ విడుదల కానుంది. ఈ టీజర్‌ కోసం అంతా చాలా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular