HomeMovie News Teluguకోహ్లీని భలే భయపెట్టేసిందే అనుష్క

కోహ్లీని భలే భయపెట్టేసిందే అనుష్క

బాలీవుడ్‌ బ్యూటీ, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి అయిన అనుష్కా శర్మ నటించిన తాజా చిత్రం ‘పరీ’. హారర్‌ బేస్‌డ్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘పరీ’. అనుష్కా – విరాట్‌ల వివాహం తర్వాత విడుదలైన అనుష్క తొలి చిత్రం ఇదే కావడంతో, ఈ సినిమాని ఈ జంట కలిసి వీక్షించారట. అయితే ఈ సినిమాలో అనుష్కా శర్మ భయంకరమైన దెయ్యం పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 

విరాట్‌ కేమో దెయ్యాల సినిమాలంటే చాలా భయమంట. అస్సలు ఎప్పుడూ దెయ్యాల సినిమాలు చూడడట. అలాంటిది తన ముద్దుల భార్యను అలా దెయ్యం గెటప్‌లో చూడడానికి చాలా భయపడ్డాడట విరాట్‌ కోహ్లీ. అయితే ఆ సమయంలో పక్కనే ఉండి అనుష్క, విరాట్‌కి ధైర్య చెప్పిందట. ఈ సన్నివేశంలో ఇలా నటించాను. ఆలా మేకప్‌ వేసుకున్నాను అంటూ వివరిస్తూ, భయపడకుండా చూసేలా చేసిందట. అయినా కానీ ఆ పాత్రలో అనుష్కని చూసిన విరాట్‌ చాలా భయపడ్డాడట. నిజంగా ఇదో గొప్ప థ్రిల్‌ అంటున్నాడు విరాట్‌. 

భారత క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌గా గ్రౌండ్‌లో బ్యాట్‌ పట్టుకుని అవతలి టీమ్‌ని రఫ్ఫాడించేసే విరాట్‌ కోహ్లీ ‘పరీ’ సినిమా చూసి భయపడడం ఫన్నీగా అనిపిస్తోంది కదా. సినిమా చూసిన తర్వాత విరాట్‌ సినిమాపై తన అభిప్రాయాలను ఇలా సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. 

అలాగే అనుష్క కెరీర్‌లో ‘పరీ’ ఖచ్చితంగా ఓ గొప్ప సినిమా అవుతుందని అన్నారు. ఇటీవలే వీరిద్దరి వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

You May Like This
- Advertisment -spot_img

Most Popular