HomeMovie News Teluguకాజల్‌తో తేజ 'ఆటాడిస్తాడా'?

కాజల్‌తో తేజ ‘ఆటాడిస్తాడా’?

క్రియేటివ్‌ డైరెక్టర్‌ తేజకి కాజల్‌ లక్కీ హ్యాండ్‌ అట. కాజల్‌ కూడా తేజ అంటే తనకెంతో అభిమానమనీ చెబుతుంటుంది. కాజల్‌ తెరంగేట్రం చేసింది తేజ సినిమాతోనే ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో కాజల్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. ఆ తర్వాత కాజల్‌ స్టార్‌ హీరోయిన్‌ స్టేజ్‌కి ఎదిగింది. ఈ క్రెడిట్‌ అంతా తన తొలి దర్శకుడు తేజకే దక్కుతుందనీ కాజల్‌ చెబుతోంది కూడా. అంతేకాదు తేజ తనకు గురువు, మార్గదర్శి అంటోంది. 

ఇదిలా ఉండగా తేజకి చాలా కాలంగా సక్సెస్‌లు లేవు. అలాంటిది ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో సరికొత్తగా తేజ రీ ఎంట్రీ ఇచ్చాడు. రీ ఎంట్రీలో తేజ తన సినిమాకి కాజల్‌ అగర్వాల్‌నే ఎంచుకున్నాడు. మంచి సక్సెస్‌ అందుకున్నాడు. దాంతో కాజల్‌ తనకి లక్కీ హ్యాండ్‌ అంటున్నాడు తేజ. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో హిట్‌ కొట్టిన తేజ రూటు మార్చేశాడు. ఎప్పుడూ కొత్త వాళ్లతో సినిమాలు తీసే తేజ, సెకండ్‌ ఇన్నింగ్స్‌లో స్టార్‌ హీరోలతో సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సక్సెస్‌తో స్టార్‌ హీరోలు తేజ కోసం క్యూ కడుతోన్న సంగతి కూడా తెలిసిందే. 

ఆ దిశగా తేజ రెండు బిగ్‌ ప్రాజెక్టులను ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టాడు కూడా. అందులో బాలయ్యతో తీయబోయే ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఒకటి. వెంకటేష్‌తో తీయబోయే ‘ఆట’ సినిమా మరోటి. వెంకీ చిత్రం ‘ఆట’ విషయానికి వస్తే, ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ని ఎంచుకునే యోచనలో తేజ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే, ఇది క్రేజీ కాంబినేషనే అవుతుంది. కాజల్‌, వెంకటేష్‌తో నటించే తొలి సినిమా ఇదే అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో!

You May Like This
- Advertisment -spot_img

Most Popular