HomeMovie News Teluguమెగాస్టార్‌ - పవర్‌ స్టార్‌ కలిసేదెలా?

మెగాస్టార్‌ – పవర్‌ స్టార్‌ కలిసేదెలా?

ఒకప్పుడు ప్రముఖ సినీ నిర్మాత అయిన సుబ్బిరామిరెడ్డి, ఇప్పుడు సినిమాలు తీయకపోయినా, ఇండస్ట్రీతో టచ్‌లోనే ఉన్నారు. ఇండస్ట్రీలో చాలా గౌరవం ఉంది ఆయనకు. మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌తో సినిమా తీయాలని ఎప్పటి నుండో కోరిక ఆయనకు. ఈ సినిమాకి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తారనీ సుబ్బిరామిరెడ్డి గతంలోనే చెప్పారు. 

అయితే ఈ విషయంపై చిరంజీవి నుండి గానీ, పవన్‌ కళ్యాణ్‌ నుండి గానీ, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నుండి కానీ ధృవీకరణ రాలేదు. అయినా కానీ ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఆయన మరో స్టేట్‌మెంట్‌ ఇచ్చారు ఈ మెగా కాంబోపై. త్వరలోనే అఫీషియల్‌ స్టేట్‌మెంట్‌ రానుందని ఆయన తాజాగా ప్రకటించారు. రాజకీయాల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి, సినిమాలపై దృష్టి పెట్టారు. బాగానే ఉంది. అయితే ఇంతవరకూ సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు వదిలేసి, రాజకీయాల్లో యాక్టివ్‌ అయ్యారు. 

ఈ తరుణంలో సుబ్బిరామిరెడ్డి కోరిక ఎలా తీరుతుందో చూడాలి మరి. ఆయనైతే చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నిర్మాతగా పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను నిర్మించిన ఆయన రీ ఎంట్రీ ఘనంగా ఉండాలనీ, ఆది కూడా ఈ మెగా కాంబోతోనే జరగాలనీ ఆయన భావిస్తున్నారట. అంతేకాదు అభిమానులకు కూడా ఈ కలయిక ఆనందమే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చిరంజీవిని, పవన్‌ కళ్యాణ్‌ని ఒప్పించి, సుబ్బిరామి రెడ్డి తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ని ఎలా పట్టాలెక్కిస్తారో చూడాలి మరి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular