HomeMovie News Telugu'రంగస్థలం' - జానీ మాస్టర్‌ అదరగొట్టేశాడు!

‘రంగస్థలం’ – జానీ మాస్టర్‌ అదరగొట్టేశాడు!

చరణ్‌తో సాంగ్‌ అంటే చెలరేగిపోతాడు డాన్స్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌. ఇప్పుడు చరణ్‌ కోసం ‘రంగస్థలం’లోని లాస్ట్‌ సాంగ్‌ని జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేస్తున్నాడు. ఫోక్‌ సాంగ్‌ అట అది. దాంతో ఈ సాంగ్‌కి పిచ్చ పిచ్చగా మాస్‌ స్టెప్పులు కంపోజ్‌ చేసేశాడట జానీ మాస్టర్‌. చరణ్‌ అంటే జానీ మాస్టర్‌కి అమితమైన అభిమానం. కష్ట కాలంలో ఉన్నప్పుడు చరణ్‌ తనకు ఎంతగానో సాయం చేశాడనీ చాలా సార్లు చరణ్‌ గురించి చెబుతూ ఉంటాడు జానీ మాస్టర్‌. 

ఇప్పుడు చరణ్‌ చేస్తున్న తాజా సినిమా ‘రంగస్థలం’లో చరణ్‌లానే గెటప్‌ చేసుకుని, గళ్ల లుంగీలో మాస్‌ స్టెప్పులు ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ స్పెషల్‌ సాంగ్‌ తర్వాత సినిమాకి గుమ్మడికాయ కొట్టేయనున్నారట. అంటే చిత్ర నిర్మాణం పూర్తయినట్లేనని అర్ధం. ఈ సాంగ్‌లో ముద్దుగుమ్మ పూజా హెగ్దే, చరణ్‌తో కలిసి చిందేయనుంది. ఇక డైరెక్టర్‌ సుకుమార్‌ విషయానికి వస్తే, ఐటెం సాంగ్స్‌ విషయంలో సుకుమార్‌ది స్పెషల్‌ టేస్ట్‌ అని చెప్పక తప్పదు. 

‘జగడం’ సినిమా నుండి చూసుకుంటే, ‘ఆర్య’లో అ అంటే అమలాపురం సాంగ్‌ అయినా, ‘ఆర్య 2’ లో ‘రింగా రింగా’ సాంగ్‌ అయినా, ‘100 పర్సెంట్‌ లవ్‌’లో డియ్యాలో డియ్యాలో సాంగ్‌ అయినా, ఇలా ఒక్కటేమిటి.. ఏ సినిమా తీసుకున్నా, సినిమా హిట్‌తో సంబంధం లేకుండా ఐటెం సాంగ్స్‌ అన్నీ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటాయి సుకుమార్‌ సినిమాల్లో. డిఫరెంట్‌ అప్రోచ్‌తో కాన్సెప్ట్‌ పరంగానైనా, డాన్స్‌ పరంగానైనా చాలా చాలా ప్రత్యేకతలు సంతరించుకుంటాయి ఆ సాంగ్స్‌. 

మన ఫోక్స్‌ని తన ఐటెం సాంగ్స్‌లో రిఫ్లెక్ట్‌ చేయడంలో సుకుమార్‌ది ప్రత్యేక శైలి అని చెప్పొచ్చు. అలాంటిది తనకెంతో ప్రత్యేకమైన ‘రంగస్థలం’ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌పై ఇంకెంత స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ పెట్టి ఉంటాడో కదా సుకుమార్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular