HomeMovie News Teluguమరో ప్రయోగానికి సిద్ధమవుతున్న మంచు మనోజ్‌

మరో ప్రయోగానికి సిద్ధమవుతున్న మంచు మనోజ్‌

‘ఒక్కడు మిగిలాడు’ సినిమాతో ప్రయోగం చేసిన మంచు వారబ్బాయి మంచు మనోజ్‌ ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడట. ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత చిన్న బ్రేక్‌ తీసుకున్నాడు మనోజ్‌. ఈ సినిమా కోసం బాగా బరువు పెరిగిన మనోజ్‌, కొత్త సినిమా కోసం ఆ పెరిగిన బరువును తగ్గించుకుంటున్నాడట. అందుకే ఈ చిన్న బ్రేక్‌ అంటున్నాడు. 

కొత్త సినిమా కోసం ఓ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ దర్శకున్ని పరిచయం చేస్తున్నాడట మనోజ్‌. కథ బాగా నచ్చి, వెంటనే ఓకే చెప్పాడనీ సమాచారమ్‌. అయితే పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయట. బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్న మనోజ్‌ ఇప్పుడు బిజీ బిజీగా జిమ్‌లో ఎక్కువ టైం స్పెండ్‌ చేస్తున్నాడట. మరో రెండు నెలల్లో ఈ సినిమాని పట్టాలెక్కించనున్నాడట. సినిమా సినిమాకీ వైవిధ్యం ఉండేటట్లు చూసుకునే మంచు మనోజ్‌ ఈ సారి కూడా కొత్త కథతోనే రాబోతున్నాడట. 

మొదట్నుంచీ రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా ఏదో కొత్తగా ఆలోచించాలనే ఆటిట్యూడ్‌ మంచు మనోజ్‌ది. అందుకే ఆ కొత్తదనంలో కమర్షియల్‌ ఎలిమెంట్‌ని ఎక్కువగా మిస్‌ అవుతూ ఉంటాడు. అయితే ఈ సారి కొత్తదనంతో పాటు, కమర్షియల్‌ అంశాలనూ దృష్టిలో పెట్టుకుంటానంటున్నాడు మనోడు. గతంలో ‘గుంటూరోడు’ సినిమాతో కమర్షియల్‌ టచ్‌ ట్రై చేసి ఫర్వాలేదనిపించాడు. ఇప్పుడు కూడా అలాగే సరికొత్త కథా, కథనాలతో సాగే మాంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌తో మన ముందుకు రానున్నాడట మంచు మనోజ్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular