HomeMovie News Teluguఆ స్టెప్పులేంటి? ఆ వయసేంటి బాలయ్యా!

ఆ స్టెప్పులేంటి? ఆ వయసేంటి బాలయ్యా!

అభిమానుల్ని అలరించడం కోసం బాలయ్య తెరపై తన వయసుని మర్చిపోతుంటారు. ఆయనంతలా ఎనర్జీ తెరపై ప్రదర్శిస్తోంటే, ఆయనకు యాభయ్యేళ్ళపైన వయసు ఉందంటే ఎవరు మాత్రం నమ్ముతారు? బాలయ్య అభిమానులకీ, ఆయనకీ ఈ వయసు విషయంలో ఎప్పుడూ కన్‌ఫ్యూజనే. ఒక్కసారి పాత్రలోకి ఎంటర్‌ అయితే వయసు మర్చిపోతాననడం బాలయ్యకి అలవాటే. బాలయ్యని అలా తెరపై చూస్తుంటే తాము ఆయన వయసుని మర్చిపోతామని చెప్పడం బాలయ్య అభిమానులకీ అలవాటే. 

అందుకే తన తాజా సినిమా ‘జై సింహా’లో బాలయ్య వసు మీద నయనతారతో ఓ డైలాగ్‌ కూడా చెప్పించేశారు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం గురించే ఎప్పుడూ ఆలోచిస్తానని బాలయ్య ‘జై సింహా’ సినిమా ప్రమోషన్‌ సందర్భంగా వెల్లడించారు. 100 సినిమాలు దాటినా, సెట్‌లోకి వెళితే దర్శకుడు చెప్పిందే వేదంగా భావిస్తానని చెప్పడం బాలయ్యకే చెల్లింది. మాస్‌, సూపర్‌ మాస్‌ తరహాలో ‘జై సింహా’ ఉంటుందని సినిమా ప్రోమోస్‌ చెబుతున్నాయి. మాస్‌ని మెప్పించే అంశాలు సినిమా నిండా పుష్కలంగా ఉంటాయని బాలయ్య భరోసా ఇస్తున్నారు. ఇకపై చేయబోయే సినిమాలూ కమర్షియల్‌గా ఉంటూనే, కొత్తదనంతో కూడుకున్నవై ఉండేలా చేస్తానని అంటున్న బాలకృష్ణ, నయనతారతో తనకు ఇది చాలా ప్రత్యేకమైన సినిమా అన్నారు. ఈ సినిమాలో నయనతార పాత్ర చాలా బాగా వచ్చిందనీ, హరిప్రియతోపాటు నటాషా దోషీ సినిమా కోసం చాలా కష్టపడ్డారని బాలయ్య వెల్లడించారు. 

ప్రోమోస్‌ చూసి, బాలయ్య వయసు తగ్గిపోయిందని అందరూ అంటోంటే సంతోషంగా ఉంటుందనీ, వారితో అలా అనిపించుకోవడానికే తెరపై తాను ఇంకా యాక్టివ్‌గా కనిపించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ.

You May Like This
- Advertisment -spot_img

Most Popular