HomeMovie News Telugu'వన్‌ అండ్‌ ఓన్లీ లేడీ సూపర్‌ స్టార్‌' ఆమె మాత్రమే!

‘వన్‌ అండ్‌ ఓన్లీ లేడీ సూపర్‌ స్టార్‌’ ఆమె మాత్రమే!

తెలుగులో లేడీ సూపర్‌ స్టార్‌ అనంటే ముందుగా అందరికీ విజయశాంతి పేరే గుర్తుకొస్తుంది. ఆమె సోలో ఇమేజ్‌తో అప్పట్లో సినిమాలు సంచలన విజయాల్ని అందుకున్నాయి. యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టేస్తూ, ఫిమేల్‌ సెంట్రిక్‌ మూవీస్‌లో విజయశాంతి సత్తా చాటడం చూశాం. అయితే విజయశాంతి తర్వాత అలాంటి పాత్రల్లో ఎంతోమంది కన్పించినా, లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ మాత్రం ఇంకెవరికీ రాలేదు. ‘స్టార్‌ హీరోయిన్‌’, ‘నెంబర్‌ వన్‌ హీరోయిన్‌’ రేసుల్లోకి చాలామంది వచ్చి వెళ్ళారు. 

అయితే ఎవరికీ, హీరోలతో సమానంగా ఇమేజ్‌ వచ్చింది లేదు. కానీ ఆనుష్క, విజయశాంతి తర్వాత ఆ స్థాయిలో ‘లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌’ దక్కించుకోవడం గమనించదగ్గ అంశం. ఆ క్రెడిట్‌ ఆమెకు వచ్చేలా చేసిన సినిమా ‘అరుంధతి’. ఆ తర్వాత ‘పంచాక్షరి’ సినిమాలోనూ పవర్‌ఫుల్‌గా అనుష్క కన్పించినా, ‘అరుంధతి’ ముందు ‘పంచాక్షరి’ తేలిపోయింది. అదలా ఉంచితే ఇప్పుడు ‘భాగమతి’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అనుష్క. షూటింగ్‌ ఎప్పుడు మొదలైంది? ఎక్కడ షూటింగ్‌ చేశారు? అనే విషయాలపై పెద్దగా ప్రచారం లేకుండానే, సినిమా ఫస్ట్‌ లుక్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు దర్శకుడు అశోక్‌. 

ఫస్ట్‌ లుక్‌ అదిరిపోయింది. ట్రైలర్‌ అయితే దుమ్మురేపేసింది. ఇప్పుడు టాలీవుడ్‌లో ఒకటే మాట అనుష్క గురించి. వన్‌ అండ్‌ ఓన్లీ లేడీ సూపర్‌ స్టార్‌ అనుష్క ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోందని. సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేశాయి. సినిమాలో అనుష్క లుక్‌ దగ్గర్నుంచి, అన్నీ కొత్తగా ఉండేలా ప్లాన్‌ చేశారు. ప్రోమో విజువల్స్‌ చూస్తే, ఇదేదో హాలీవుడ్‌ మూవీనా? అన్న ఆలోచన కలుగుతుంది. లేడీ సూపర్‌ స్టార్‌ అనుష్క వచ్చేస్తోంది బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాయడానికి. ‘జేజెమ్మ’గా ‘అరుంధతి’ సినిమాతో విమర్శకుల ప్రశంసల్ని కూడా అందుకున్న అనుష్క, ‘భాగమతి’ సినిమాతో ఎలాంటి కొత్త రికార్డులు క్రియేట్‌ చేయనుందో చూడాలిక.

You May Like This
- Advertisment -spot_img

Most Popular