HomeMovie News Telugu'పార్టీ టైమ్‌ బిగిన్స్‌' విత్‌ 'కొడకా..'

‘పార్టీ టైమ్‌ బిగిన్స్‌’ విత్‌ ‘కొడకా..’

‘అజ్ఞాతవాసి’ సినమా కోసం పవన్‌ కళ్యాణ్‌ ఓ పాట పాడాడన్న సంగతి తెలిసిందే. ఈ పాట టీజర్‌ని తాజగా విడుదల చేశారు. పాట టీజర్‌లో పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ చాలా సరదా సరదాగా కనిపిస్తున్నారు. 

‘కొడకా కోటేశ్వరరావు.. ‘ అంటూ సాగే ఈ పాటని భాస్కరభట్ల రచించారు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు. టీజర్‌లో ఈ నలుగురూ ఉన్నారు. పవన్‌ కూని రాగంతో పాట ఎత్తుకోవడం, సరిగా కుదరక నవ్వుతుండగా, వెనక నుండి త్రివిక్రమ్‌ ‘ఇది ఇప్పుడప్పుడే తెమిలే పని కాదు, నాకర్ధమవుతోంది..’ అంటుండడం ఇదంతా చాలా ఫన్నీగా అనిపిస్తోంది. మరో పక్క అనిరుధ్‌ 1,2,3..అనగానే ‘కొడకా..కొడకా..’ అని పవన్‌ పాట స్టార్ట్‌ చేశాడు.. ఇంతలో టీజర్‌ కట్‌ అయ్యింది. ఇదీ ఈ సాంగ్‌ టీజర్‌ కథ. ది పార్టీ టైమ్‌ బిగిన్స్‌ డిశంబర్‌ 31..అంటూ ఈ పాట టీజర్‌ని విడుదల చేశారు. డిశంబర్‌ 31కి ఈ పాటని పూర్తిగా విడుదల చేయనున్నారు. 

ఈ పాటతోనే న్యూ ఇయర్‌ స్టార్ట్‌ కానుందన్న మాట. న్యూ ఇయర్‌లో పవన్‌ నుండి వస్తున్న ఫస్ట్‌ గిఫ్ట్‌ ఇదే అనుకోవాలి. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అజ్ఞాతవాసి’ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాలతో ఈ సినిమా విడుదల కానుంది. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తో అదరగొట్టేస్తున్నాడు పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే. రికార్డు స్థాయిలో బిజినెస్‌ జరిగింది ఈ సినిమాకి. 

పవన్‌తో అనూ ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేష్‌ తొలి సారిగా జత కడుతున్నారు. హీరోయిన్స్‌తో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ పోస్టర్స్‌ పవన్‌ అభిమానుల్ని పిచ్చెక్కించేస్తున్నాయ్‌ ఓ పక్క, ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో అనూ ఇమ్మాన్యుయేల్‌తో ఉన్న సాంగ్‌ మేకింగ్‌ వీడియో రిలీజ్‌ చేశారు. మంచి రెస్పాన్స్‌ వచ్చింది ఆ వీడియోకి. సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అన్నట్లు వెంకటేష్‌ ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular