HomeMovie News Teluguనయనతారకు కూడా పెళ్లయిపోయిందా?

నయనతారకు కూడా పెళ్లయిపోయిందా?

ముద్దుగుమ్మ నయనతార తమిళ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో గత కొంత కాలంగా లవ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఓ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. విఘ్నేష్‌ శివన్‌తో నయన్‌ చాలా క్లోజ్‌గా ఉన్న ఫోటో అది. ఈ ఫోటో చూసి నయనతార అభిమానుల్లో కొన్ని రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. 

ఈ మధ్య ఇలియానా పోస్ట్‌ చేసిన ఓ ఫోటోతో ఆమె పెళ్లయిపోయినట్లుగా తెలిసింది. ఫోటోపై మై హబ్బీ అని హ్యాష్‌ టాగ్‌ పెట్టి రిలీజ్‌ చేసిన ఆ ఫోటోతో ఇలియానా అభిమానులు బెల్లీ బేబీ పెళ్లి చేసేసుకుందనే భావించారు. అలాగే ఇప్పుడు నయనతార విషయంలోనూ భావించాల్సి వస్తోంది. ఎందుకంటే నయనతార, తన ప్రియుడు విఘ్నేష్‌తో ఇంత క్లోజ్‌గా ఉన్న ఫోటో చూస్తుంటే అలాగే అనిపిస్తోంది మరి. ఒక పక్క నయనతార 14 ఏళ్ల సినీ కెరీర్‌ పూర్తి చేసుకున్న సందర్భం కలిసొచ్చేలా, మరో పక్క క్రిస్‌మస్‌ పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లుగా మెసేజ్‌ పెట్టి, విఘ్నేష్‌, నయన్‌తో కలిసి దిగిన సెల్ఫీ అది. నయనతార సిగ్గుపడుతూ, విఘ్నేష్‌ వెనక దాగి ఉన్నట్లుగా ఉంది ఆ ఫోటో.

ఏదేమైనా ఫోటో మాత్రం చాలా రొమాంటిక్‌గా ఉంది. ఇంత క్లోజ్‌గా ఉన్నారంటే ఈ ఇద్దరి మధ్యా లవ్‌కి మించి ఇంకేదైనా ఉండి ఉంటుందనీ నెటిజన్లు భావిస్తున్నారు. అయితే అదేంటో తెలియాలంటే మాత్రం నయనతార స్పందించాల్సిందే. గతంలోనూ ఈ ఇద్దరూ క్లోజ్‌గా దిగిన ఫోటోలు చాలానే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే వాటన్నింట్లోనూ ఈ ఫోటో ప్రత్యేకంగా అనిపిస్తోంది. అందుకే ఈ ఫోటో చుట్టూ ఇన్ని అనుమానాలు ముసురుకుంటున్నాయి. 

ఇకపోతే ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంది నయనతార. తెలుగులో చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’లోనూ, బాలకృష్ణతో ‘జై సింహా’ చిత్రాల్లో నటిస్తోంది నయనతార. ‘జై సింహా’ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular