HomeMovie News Teluguతమన్నా - చెన్నై కాలింగ్‌

తమన్నా – చెన్నై కాలింగ్‌

ముచ్చటగా మూడు భాషల్లోనూ నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా దూసుకెళ్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. హీరోయిన్‌గానే కాకుండా, స్పెషల్‌ సాంగ్స్‌తో కూడా క్రేజ్‌ సంపాదించేసింది తెలుగులో తమన్నా. టాప్‌ మోస్ట్‌ హీరోయిన్స్‌లో ఒకరైన తమన్నా ఇప్పుడు కొంచెం స్పీడు తగ్గించింది. తెలుగులో ‘క్వీన్‌’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాని బాలీవుడ్‌ ‘క్వీన్‌’కి తెలుగు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. 

అక్కడ ‘క్వీన్‌’గా కంగనా నటిస్తే, తెలుగులో ఆ పాత్ర కోసం మన మిల్కీ బ్యూటీని ఎంచుకున్నారు. ఈ సినిమాని తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రీమేక్‌ చేస్తున్నారు. వరుసగా వాటిలో కాజల్‌ అగర్వాల్‌, ఫారుల్‌ యాదవ్‌, మంజిమా మోహన్‌ లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్నారు. కాగా తమన్నా విషయానికి వస్తే, తమిళంలో ఇప్పటికే విక్రమ్‌తో నటించిన ‘స్కెచ్‌’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. 

ఇకపోతే తాజాగా ఉదయ్‌ నిధి స్టాలిన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాకి తమన్నా సైన్‌ చేసింది. ఈ సినిమా జనవరి 19 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. ఇటు తెలుగులో ‘క్వీన్‌’తోనూ, అటు తమిళంలో ఈ కొత్త సినిమాతోనూ తమన్నా బిజీగా గడపనుంది. కొత్త సంవత్సరంలో తమన్నా మరిన్ని బిగ్‌ ప్రాజెక్టులు ఓకే చేయనుందట. శీను రామ్‌సామి నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ‘కన్నెకలైమానె’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుందట. 

గతంలోనూ తమన్నా నటించిన ‘ఆవారా’ తదితర తమిళ చిత్రాలు తెలుగులోకి డబ్‌ అయ్యాయి. కాగా కెరీర్‌ కొంచెం స్లో అయిన మూడ్‌లో ‘క్వీన్‌’ రూపంలో తమన్నా జాక్‌ పాట్‌ కొట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో మళ్లీ తమన్నా బిజీ అయిపోయింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular