HomeMovie News Telugu'అజ్ఞాతవాసి' సంచలనాలకు ఆకాశమే హద్దు

‘అజ్ఞాతవాసి’ సంచలనాలకు ఆకాశమే హద్దు

‘అజ్ఞాతవాసి’ టీజర్‌ వచ్చాక సినిమాపై ఇంతవరకూ ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. టీజర్‌లో పవన్‌ సిగ్నేచర్స్‌ అభిమానుల్ని ఊపు ఊపేస్తున్నాయి. కీర్తి సురేష్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌తో పవన్‌ ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ అదిరిపోతోంది. టీజర్‌ రాగానే యూ ట్యూబ్‌లో ఈ టీజర్‌ సంచలనాలు మొదలయ్యాయి. ఊహించని స్థాయిలో ట్రెండింగ్‌ అయిపోయింది ‘అజ్ఞాతవాసి’ టీజర్‌. 

ఇంతవరకూ వచ్చిన స్టిల్స్‌ని ఎంతో ఇన్నోవేటివ్‌గా డిజైన్‌ చేశారు. ఇక టీజర్‌ కట్‌ కూడా చాలా బాగుంది. టీజర్‌లో చాలా ఆశక్తికరమైన అంశాలను చూపించారు. యాక్షన్‌ సీన్స్‌, రొమాన్స్‌ ఇవే కాకుండా కొన్ని ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. పవన్‌ వెనుక కొంతమంది అఘోరాలు నడిచి వస్తున్న సీన్‌, అలాగే ఒక పక్క పచ్చని పైరులు, మరో పక్క హైఫై లొకేషన్స్‌ని చూపించారు. 

చేతికి బ్యాగ్‌ తగిలించుకుని పవన్‌ కళ్యాణ్‌ చాలా డీసెంట్‌గా కనిస్తున్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కదా. చేతిలో ఐడీ కార్ట్‌తో కనిపస్తున్నాడు. నార్మల్స్‌లో హ్యాండ్‌సమ్‌ లుక్స్‌తో పవన్‌ కళ్యాణ్‌ అదరగొట్టేస్తున్నాడు. ఇద్దరు ముద్దుగుమ్మలు చాలా అందంగా ఉన్నారు. అలాగే గ్లామరస్‌గానూ ఉన్నారు. అనూ ఇమ్మాన్యుయేల్‌ గ్లామర్‌ అయితే కొంచెం డోస్‌ ఎక్కువగానే ఉంది. 

టీజర్‌ ముచ్చట్లే ఇన్ని ఉంటే, ఇక రేపు అందరూ ఎదురు చూస్తున్న ట్రైలర్‌ రాబోతోంది. రేపే ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌. ఈ సందర్భంగా ధియేట్రికల్‌ ట్రైలర్‌నీ విడుదల చేయనుంది చిత్ర యూనిట్‌. టీజర్‌లోనే ఎన్నో కటింగ్స్‌ చూపించేసిన పవన్‌ కళ్యాణ్‌ ఇక ట్రైలర్‌ ద్వారా ఇంకెన్ని చూపించనున్నాడో. ఓవర్సీస్‌లో ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలున్నాయి. బిజినెస్‌ ఓ రేంజ్‌లో జరుగుతోందక్కడ. 

అనిరుధ్‌ మ్యూజిక్‌లో వచ్చిన రెండు సాంగ్స్‌ ప్రెజెంట్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇక మిగిలిన సాంగ్స్‌ ఎలా ఉండనున్నాయో తెలుసుకోవాడానికి జస్ట్‌ కొన్ని అవర్స్‌ మాత్రమే మిగిలుంది. రేపు సాయంత్రం ‘అజ్ఞాతవాసి’ ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ జరగనుంది. జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular