HomeMovie News Teluguసినీరంగంలోకి హీరోగా మరో వారసుడు

సినీరంగంలోకి హీరోగా మరో వారసుడు

ఇప్పటికే అలనాటి సినీ తారల వారసులు సినీ రంగంలోకి తెరంగేట్రం చేయడం స్టార్ట్‌ అయ్యింది. తాజాగా అందాల నటి సుమలత కుమారుడు అభిషేక్‌ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. కన్నడ నటుడు అంబరీష్‌ని వివాహం చేసుకుని అక్కడే సెటిలైపోయింది నటి సుమలత. సుమలత – అంబరీష్‌ల ముద్దుల కుమారుడు అభిషేక్‌ తాజాగా ఓ కన్నడ మూవీతో తెరంగేట్రం చేస్తున్నాడు. 

ప్రముఖ కన్నడ నిర్మాత సందేశ్‌ నాగరాజ్‌, అభిషేక్‌తో తొలి సినిమా తీయబోతున్నట్లు కన్నడ చిత్ర వర్గాల సమాచారమ్‌. తన తల్లితండ్రుల మాదిరిగానే తాను కూడా నటుడు కావాలన్నదే అభిషేక్‌ అభిలాషట. అందుకు తల్లి తండ్రులు ఒప్పుకోవడంతో, గత కొంత కాలంగా అభిషేక్‌ నటనలో ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నాడు. అలాగే డాన్సులు, మార్షల్‌ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ తీసుకున్నాడట. ప్రస్తుతం హీరోగా సంసిద్ధం అయ్యాడనీ తెలుస్తోంది. తొందరలోనే హీరోగా అభిషేక్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నాడట. 

ఇప్పటికే పలువురు సినీ తారలు తమ వారసులను ఆల్రెడీ సినీ రంగానికి పరిచయం చేశారు. వారిలో సీనియర్‌ నటి రాధ కుమారై కార్తీక తెలుగులో ‘జోష్‌’ సినిమాతో తెరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ చిత్రాలతో ప్రస్తుతం బిజీగా ఉంది. ఆమె రెండో కూతురు తులసి కూడా సినీ రంగంలోనే ఉంది. ‘కడలి’ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. అలాగే జయసుధ కుమారుడు తెలుగులో ఓ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తాజాగా అలనాటి మేటి నటి శ్రీదేవి కుమారై జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తోంది. హిందీలో ‘ధడక్‌’ చిత్రంతో ఈ జూనియర్‌ శ్రీదేవి హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular