HomeMovie News Telugu'పీకే క్రియేటివ్‌ వర్క్స్‌' ఇది సినిమా కోసం

‘పీకే క్రియేటివ్‌ వర్క్స్‌’ ఇది సినిమా కోసం

పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ అనేది పవన్‌ కళ్యాణ్‌ బ్యానర్‌ పేరు. అయితే ఇదే పేరుతో పవన్‌ కళ్యాణ్‌ తాజాగా ట్విట్టర్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేశారు. ఇంతవరకూ ఉన్న పవన్‌ ట్విట్టర్‌ ‘పవన్‌కళ్యాణ్‌’ అనే పేరుతో ఉంటుంది. తాజాగా ఓపెన్‌ చేసిన ట్విట్టర్‌ అకౌంట్‌ని ‘పీకే క్రియేటివ్‌ వర్క్స్‌’ పేరుతో ఓపెన్‌ చేశాడు. ఈ ట్విట్టర్‌ అకౌంట్‌ ఓన్లీ ఫర్‌ సినిమాస్‌కేనట. 

ఇంతవరకూ ఉన్న అకౌంట్‌లో సినిమాల గురించి ప్రస్థావించలేదు పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడూ. ఇందులో రాజకీయాల కోసం, ‘జనసేన’ పార్టీ కోసమే ప్రస్థావించడం జరిగింది. తాజా అకౌంట్‌ని సినిమాల కోసమే ఓపెన్‌ చేశాడట. ఇది ఎందుకు అంటే ఇకపై రాజకీయాల్లో పవన్‌ యాక్టివ్‌ కానున్నాడట. అలాగే సినిమాలనూ వదిలిపెట్టను అనేందుకు సంకేతంగానే ఈ కొత్త ట్విట్టర్‌ ఖాతా. సినిమాలకి సంబంధించిన అప్‌డేట్స్‌ని అభిమానులతో పంచుకునేందుకు వీలుగా ఈ తాజా ట్విట్టర్‌ ఖాతాని తెరిచాడు పవన్‌ కళ్యాణ్‌. 

రాజకీయాల్లోకి వచ్చాక అన్నయ్య చిరంజీవి సినిమాలకు దూరమయ్యాడు. దాంతో అభిమానులు చాలా డిజప్పాయింట్‌ అయ్యారు. కానీ పవన్‌ విషయంలో అలా జరగకూడదని చిరంజీవి అన్నారు. ఒక పక్క సినిమాలనూ, మరో పక్క రాజకీయాలనూ ఒకేసారి మేనేజ్‌ చేయగల సత్తా ఉన్నోడు పవన్‌ కళ్యాణ్‌. కాబట్టి రెండింటినీ బ్యాలెన్స్‌ చేస్తాడనీ అన్నయ్య గతంలో చెప్పిన మాటను తమ్ముడు ఫాలో చేస్తున్నాడని తెలుస్తోంది. అవును ఇలా చేయడం వల్ల పవన్‌ అభిమానులు డిజప్పాయింట్‌ అయ్యే అవకాశం ఉండదు. అభిమానులు పండగ చేసుకునే విషయమే ఇది. 

ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో ‘అజ్ఞాతవాసి’ సినిమాలో నటిస్తున్నాడు పవన్‌ కళ్యాణ్‌. అనూ ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular