HomeMovie News Teluguమళ్లీ ఆ కాంబినేషన్‌ ఎప్పుడో?

మళ్లీ ఆ కాంబినేషన్‌ ఎప్పుడో?

‘వర్షం’ సినిమాలో ప్రబాస్‌, గోపీచంద్‌ కలిసి నటించారు. గోపీచంద్‌ ఈ సినిమాలో విలన్‌గా నటించాడు. ఇంతవరకూ మాత్రమే ఈ కాంబినేషన్‌ గురించి మనకు తెలుసు. అయితే ఈ ఇద్దరూ ఆఫ్‌ స్క్రీన్‌ మంచి స్నేహితులట. స్నేహితులు అంటే ఇండస్ట్రీలో కామనే అనుకునేరు. కానీ కాదు. ఈ ఇద్దరూ చాలా మంచి స్నేహితులన్న మాట గోపీంచంద్‌ తాజాగా పెదవి విప్పడంతో తెలిసింది. ఈ ఇద్దరూ కలిసి ఎప్పుడు మాట్లాడుకున్నా, మనం ఇద్దరం మళ్లీ కలిసి ఓ సినిమా చేయాలి అనే మాటని ఖచ్చితంగా మాట్లాడుకుంటారట. అయితే ఇంతవరకూ మళ్లీ ఆ కాంబినేషన్‌ కుదరలేదు. 

బహుశా ‘బాహుబలి’ కారణంగా ఈ కాంబినేషన్‌ సెట్‌ అయ్యి ఉండదు. దాదాపు ఐదేళ్లుగా ప్రబాస్‌ ఈ సినిమాతోనే బిజీ అయిపోవాల్సి వచ్చింది. కాగా అన్నీ కుదిరితే ఈ కాంబినేషన్‌లో త్వరలోనే సినిమా వచ్చే అవకాశాలు లేకపోలేదన్న మాట. అయితే ‘వర్షం’ కాంబినేషన్‌లా హీరో – విలన్‌ కాంబోనా? లేక మల్టీస్టారర్‌నా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ విలన్‌గా నటించాలన్నా గోపీంచంద్‌ సిద్ధమే. ఎందుకంటే హీరోగా చేస్తూనే విలన్‌గా నటించడానికీ గోపీచంద్‌కి ఏమాత్రం ప్రాబ్లెమ్‌ లేదు. 

తాజాగా ‘గౌతమ్‌ నందా’ సినిమాలో గోపీచంద్‌ డబుల్‌ రోల్‌ పోషించాడు. అందులో ఒక పాత్ర పూర్తిగా నెగిటివ్‌ షేడ్స్‌తో కూడుకొన్నదే. సో ఆ రకంగా చూసినా మరోసారి విలన్‌ అవతారమెత్తడానికి గోపీచంద్‌ రెడీగా ఉన్నట్లే అనుకోవాలి. లేదంటే ఈ మధ్య మన టాలీవుడ్‌లోనూ మల్టీ స్టారర్‌ సినిమాలు బాగానే ఊపందుకున్నాయి. ఆ రకంగానైనా ఈ కాంబినేషన్‌ సెట్‌ అవ్వొచ్చు. అయితే ఈ కాంబినేషన్‌కి వర్కవుట్‌ అయ్యే స్క్రిప్ట్‌ రచన జరగాలి ముందు. అది జరిగితే వెంటనే ఈ కాంబినేషన్‌ రూపు దాల్చడం ఖాయం. ప్రస్తుతం ప్రబాస్‌ సుజిత్‌ దర్శకత్వంలో ‘సాహో’ సినిమాలో నటిస్తున్నాడు. గోపీచంద్‌ నటించిన ‘ఆక్సిజన్‌’ డిశంబర్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular