HomeMovie News Teluguచేప కాదు ముప్పై ఐదేళ్ల సొగసు

చేప కాదు ముప్పై ఐదేళ్ల సొగసు

నీటలో చేపపిల్లలా తేలియాడుతూ, ఈత కొడుతున్న ఈ బ్యూటీని గుర్తు పట్టారా? ముద్దుగుమ్మ శ్రియ. పదేళ్లకు పైగానే తెలుగు చిత్ర సీమను ఏలుతోంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్‌ లాస్ట్‌ దశలోనూ మంచి మంచి అవకాశాలు దక్కించుకోవడం ఒక్క శ్రియకే దక్కిందనడంలో అతిశయోక్తి కాదు. తన తోటి హీరోయిన్లలో ఎవ్వరూ ఆమెలా ఫిజిక్‌ని కాపాడుకోలేకపోయారు. కెరీర్‌ స్టార్టింగ్‌ నుండీ ఒకే ఫిజిక్‌ని మెయింటైన్‌ చేస్తూ వస్తోంది బ్యూటీ శ్రియ. ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు ఆమె కెరీర్‌లో ఉన్నాయి. సీనియర్‌ హీరోస్‌తో పాటు, యంగ్‌ హీరోస్‌తోనూ నటిస్తోంది శ్రియ.

ఏ క్యారెక్టర్‌కైనా ఇట్టే సూటయ్‌పోయే ఫిజిక్‌ ఆమెది. హుందా అయిన క్యారెక్టర్‌లోనైనా, అమాయకత్వం ఉన్న క్యారెక్టర్‌కైనా, మోడ్రన్‌ అండ్‌ ట్రెండీ గెటప్‌ అయినా శ్రియకి ఇట్టే మ్యాచ్‌ అవుతుంది. అదే ఆమెని సీనియర్‌ అయినా కానీ ఈ స్థాయిలో అవకాశాలు దక్కించుకేందుకు ఛాన్స్‌ ఇచ్చింది. బేసిగ్గా ఈ ముద్దుగుమ్మ ట్రైన్‌డ్‌ క్లాసికల్‌ డాన్సర్‌. ఆమె నృత్యం చేస్తే నెమలి ఫింఛం విప్పి నాట్యమాడినంత అందంగా ఉంటుంది. శరీరాన్ని ఏ ఆకృతిలోనైనా కదిలించి, మెప్పించగలదు ఆమె డాన్సుతో. అంత ఫిట్‌గా ఉండడానికి కారణం ఏంటని అడిగితే తన డాన్సే తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ అంటోంది.

హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించి, గెస్ట్‌ రోల్స్‌లోనూ మెరిసింది. పలు ఐటెం సాంగ్స్‌తో శ్రియ ది స్పెషల్‌ అనిపించుకుంది. మూడు పదుల వయసులో ఇలా వాటర్‌లో స్కూబా డైవింగ్‌ చేస్తోంది. ఆ స్కూబా డైవింగ్‌లో ఆమె అందాల పోజు, పక్కనున్న అందమైన చేప పిల్లలు కుళ్లుకునేలా లేదూ.. అదే శ్రియ గ్లామర్‌ ప్రత్యేకత.

You May Like This
- Advertisment -spot_img

Most Popular