HomeMovie News Teluguబుల్లి ఎన్టీఆర్‌ కూడా సినిమాల్లోకి వచ్చేస్తాడా?

బుల్లి ఎన్టీఆర్‌ కూడా సినిమాల్లోకి వచ్చేస్తాడా?

ఎన్టీఆర్‌ తాజా చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో ఉండబోతోందన్న సంగతి తెలిసిందే. సోమవారం ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సాక్షిగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి తమిళ యంగ్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ మ్యూజిక్‌నందిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ హాట్‌ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ద్వారా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తనయుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే పలువురు హీరోల తనయులు ఛైల్డ్‌ ఆర్టిస్టులుగా తమ తమ తండ్రి సినిమాలతోనే ఎంట్రీ ఇచ్చారు. ‘వన్‌ – నేనొక్కడినే’ సినిమాతో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తనయుడు గౌతమ్‌ తెరంగేట్రం చేశాడు. ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘రాజా ది గ్రేట్‌’ సినిమాతో మాస్‌ రాజా రవితేజ తనయుడు మహాధన్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌ వంతు వచ్చింది. ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాతోనే ఎన్టీఆర్‌ తనయుడు అభయ్‌ రామ్‌ తెరంగేట్రం చేస్తున్నాడనీ బాగా ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంలో చిత్ర యూనిట్‌ నుండి ఇంకా అపీషియల్‌ క్లారిటీ రాలేదు.

కానీ ప్రచారం అయతే జోరుగా సాగుతోంది. ఇకపోతే ఈ సినిమా ప్రారంభోత్సవంలోనూ అభయ్‌ రామ్‌ సందడి చేశాడు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సో ఒకవేళ ఈ సినిమాతో అభయ్‌ రామ్‌ ఎంట్రీ నిజమైతే ఎన్టీఆర్‌ అభిమానులకు దబుల్‌ ధమాకా అన్నమాట. ఒకేసారి ఎన్టీఆర్‌నీ, తనయుడు అభయ్‌రామ్‌నీ ఒకే స్క్రీన్‌పై చూసి ఆనందించే అవకాశం. చూడాలి మరి జరుగుతుందో లేదో!

You May Like This
- Advertisment -spot_img

Most Popular