HomeMovie News Teluguరానా దూకుడుకి ఆకాశమే హద్దు

రానా దూకుడుకి ఆకాశమే హద్దు

‘బాహుబలి’లో భళ్లాలదేవగా యూనివర్సల్‌ యాక్టర్‌ అయిపోయిన రానా బుల్లితెరపై షోస్‌ కూడా చేస్తున్నాడు. ఇది కాక ఎప్పుడు చేసేశాడో తెలీదన్నట్లుగా ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక పక్క పెద్ద సినిమాలూ, మరో పక్క చిన్న సినిమాలూ వేటికవే రానాకి. చిటికెలో చేసేస్తూ ఉంటాడు. విడుదల చేసేస్తూ ఉంటాడు. ఒక్క తెలుగులోనే కాదు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లోనూ సినిమాలు చేసేస్తూ ఉంటాడు రానా. ఇవన్నీ ఒకెత్తు, సినిమా ఈవెంట్స్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తూ అందరి మన్ననలు పొందుతూ ఉంటాడు.

ఇదంతా సరే, తాజాగా రానా ఖాతాలో మరో బిగ్‌ అచ్చీవ్‌మెంట్‌ వచ్చి చేరింది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘రోబో 2.0’ సినిమా ఆడియో ఫంక్షన్‌ దుబాయ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నది ఎవరో తెలుసా? గెస్‌ చేయండి.. చేయలేరా. ఇంకెవరు మన భళ్లాలదేవ. ఈ ఈవెంట్‌కి హోస్ట్‌గా వ్యవహరించడం తన అదృష్టంగా భావిస్తున్నాననీ రానా అంటున్నాడు. ఎందుకంటే ఇది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా ఫంక్షన్‌. వెరీ వెరీ గ్రాండ్‌ ఈవెంట్‌.

ఇలాంటి ఓ ఆడియో ఫంక్షన్‌ ఇంతకు ముందెన్నడూ తెలుగు సినీ చరిత్రలోనే కాదు ఇండియన్‌ సినీ చరిత్రలోనే ఎవరూ చూడలేదు. ఇకపై కూడా చూడలేమేమో.. ఇలాంటి ఓ గ్రాండ్‌ ఫంక్షన్‌కి రానా హోస్ట్‌గా వ్యవహరించడం నిజమే పెద్ద అచ్చీవ్‌మెంటే మరి. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడు రానా. ఈ భారీ ఈవెంట్‌ దుబాయ్‌లో జరుగుతోంది. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోబో 2.0’ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular