HomeMovie News Teluguకాసులు కొల్లగొట్టేస్తోన్న 'రాజుగారి గది-2'

కాసులు కొల్లగొట్టేస్తోన్న ‘రాజుగారి గది-2’

ప్రస్తుతం ‘రాజుగారి గది – 2’ మేనియా నడుస్తోంది. మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా సినిమా విజయవంతంగా దూసుకెళ్తోంది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు బాగా రాబడుతోంది ‘రాజుగారి గది – 2’ సినిమా. విడుదలయ్యాక కూడా ప్రమోషన్స్‌ బాగా చేస్తున్నారు ఈ సినిమాకి. నాగార్జున, సమంత ఈ ప్రమోషన్స్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. క్యూట్‌ గ్లామర్‌తో కొత్త పెళ్లికూతురు సమంత ప్రమోషన్స్‌కి మామగారైన నాగార్జునతో కలిసి అటెండ్‌ అవుతోంది. చాలా యాక్టివ్‌గా కనిపిస్తోంది. సినిమాకి సంబంధించిన అనుభవాల్ని అభిమానులతో పంచుకుంటోంది.

సినిమా విజయం అందుకున్నా, అందుకోకపోయినా, ఇలాంటి సినిమాలు కొన్ని స్వీట్‌ మెమరీస్‌ని మిగుల్చుతాయని సమంత చెబుతోంది. కానీ అనూహ్యంగా ఈ సినిమా మంచి విజయం అందుకుని, మరిన్ని స్వీట్‌ మెమరీస్‌ని తనకి మిగిల్చిందంటోం ది క్యూట్‌ సమంత. దెయ్యం సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. కానీ వాటన్నింటికీ ఈ సినిమా భిన్నంగా ఉందని నిరూపించింది. ఓంకార్‌ దర్శకత్వంలో గతంలో తెరకెక్కిన ‘రాజుగారి గది’ సినిమాకి ఈ సినిమా సీక్వెల్‌గా తెరకెక్కింది. అయితే ఆ కథకీ ఈ కథకీ ఏమాత్రం సంబంధం లేదు. పూర్తిగా కొత్తగా అనిపించింది.

అందుకే ఆడియన్స్‌ సినిమాని ఇంతగా సక్సెస్‌ చేశారు. నాగార్జున మెంటలిస్ట్‌ పాత్రలో మోడ్రన్‌ అండ్‌ హ్యాండ్‌సమ్‌ లుక్స్‌తో ఎట్రాక్ట్‌ చేస్తున్నారు. ముద్దుగుమ్మ సీరత్‌ అందాలు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి సినిమాకి. సమంత నటన కొత్తగా, డిఫరెంట్‌గా ఆకట్టుకుంది. పెళ్లి తర్వాత సమంత అందుకున్న తొలి విజయం ‘రాజుగారి గది – 2’. అవకాశం వస్తే ఇలాంటి సినిమాలు మరిన్ని చేస్తానంటోంది సమంత అక్కినేని.

You May Like This
- Advertisment -spot_img

Most Popular