HomeMovie News Teluguఅనసూయ, రామ్‌ చరణ్‌, ఓ కాకరకాయ

అనసూయ, రామ్‌ చరణ్‌, ఓ కాకరకాయ

ముద్దుగుమ్మ అనసూయ బుల్లితెరపై హాట్‌ హాట్‌గా యాంకర్‌గా గల గలా మాట్లాడేయడమే కాదండోయ్‌. వెండితెరపైనా తన గ్లామర్‌ దాడి చేస్తూనే ఉంటుంది. బట్‌ సెలక్టివ్‌గా, అయితే ఇవన్నీ చేయడమే కాదు, అమ్మడు గరిటె తిప్పడంలోనూ స్పెషలిస్టేనట. మన బ్యూటీ అనసూయ వంట బాగా చేస్తుందటండీ. అందులోనూ కాకర కాయ కూర ఇంకా బాగా చేస్తుందట ఈ ముద్దుగుమ్మ. అందుకే స్వయంగా కాకరకాయ కూర వండి ‘రంగస్థలమ్‌’ సెట్‌కి తీసుకొస్తాననీ చెప్పిందట ఈ ముద్దుగుమ్మ.

ఇంతకీ, ‘రంగస్థలమ్‌’ సెట్‌లో అనసూయ ఏం చేస్తుందంటారా? ఈ సినిమాలో అనసూయ కూడా నటిస్తోందండీ బాబూ. ఐటెం సాంగ్‌ అనుకుంటున్నారా? కాదు కాదు, ఇంపార్టెన్స్‌ ఉన్న క్యారెక్టరే ఏదో చేస్తుందటలెండి. ఐటెం సాంగ్‌ కూడా ఉండనే ఉంది. ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడే హీరో రామ్‌చరణ్‌కీ, డైరెక్టర్‌ సుకుమార్‌కీ తన కాకర కాయ కూర సంగతి చెప్పిందట. షూటింగ్‌ అయ్యేలోగా వండి తీసుకు వస్తానని భరోసా ఇచ్చిందట. తీస్కెళ్లాలని అనసూయ చెప్పింది.

ఇకపోతే సినిమా విషయానికి వస్తే, ‘రంగస్థలమ్‌’ 1985 కాలం నాటి క్యూట్‌ లవ్‌స్టోరీ. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌, సమంత జంటగా నటిస్తున్నారు. రామ్‌ చరణ్‌ కొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు. సమంతది డీ గ్లామర్‌ రోల్‌ అయినప్పటికీ చాలా కొత్తగా ఉండబోతోందట క్యారెక్టర్‌. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది ఈ చిత్రం. ఎక్కువ భాగం ఈ సినిమా షూటింగ్‌ గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. ఇదో ప్రయోగాత్మక చిత్రం. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular