HomeMovie News Teluguబ్లాక్‌ బస్టర్‌ డైరెక్టర్‌ బర్త్‌డే టుడే

బ్లాక్‌ బస్టర్‌ డైరెక్టర్‌ బర్త్‌డే టుడే

దర్శక ధీరుడు రాజమౌళి పుట్టినరోజు ఈ రోజు. ఇండియన్‌ సినిమా స్థాయిని పెంచిన ధీరుడు రాజమౌళి. ‘బాహుబలి’ సినిమాతో టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ అనే తేడా లేకుండా, అన్ని దిక్కుల సినీ ప్రముఖుల నుండీ బర్త్‌డే విషెస్‌ వెల్లువెత్తుతున్నాయి రాజమౌళికి. ‘బాహుబలి’ సినిమా తర్వాత వచ్చిన బర్త్‌డే కాబట్టి, రాజమౌళికి ఈ బర్త్‌డే వెరీ వెరీ స్పెషల్‌. సోషల్‌ మీడియా అంతా రాజమౌళి బర్త్‌డే విషెస్‌తో నిండిపోయింది. ప్రముఖుల విషెస్‌తో పాటు అభిమానులు తమకు నచ్చిన రీతిలో రాజమౌళికి విషెస్‌ అందిస్తున్నారు.

రకరకాల పోస్టర్స్‌, బర్త్‌డే ట్యాగ్స్‌తో ఆయనకి బర్త్‌డే విషెష్‌ని అందించడంలో తమ అభిరుచిని చాటుకుంటున్నారు అభిమానులు. ఈ సందర్భంగా మనం కూడా ఆయనకి హార్ట్‌ఫుల్‌గా బర్త్‌డే విషెస్‌ చెప్పేద్దామా. హ్యాపీ బర్త్‌డే టు రాజమౌళి. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే, ‘బాహుబలి’ సినిమా తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా పైనే అందరి దృష్టి. కానీ ఆయన నుండి ఇంకా క్లారిటీ రాలేదు. ‘మహాభారతం’ సినిమాని తెరకెక్కిస్తానని రాజమౌళి గతంలో చెప్పారు.

అయితే అది ఇప్పుడప్పుడే జరిగే పని కాదని ఆయన తేల్చేశారు. మరో పక్క ఆయనతో సినిమా చేసేందుకు మహేష్‌బాబు తదితర స్టార్‌ హీరోలు లైన్‌లో ఉన్నారు. అయితే ఆయన ఛాయిస్‌ ఎవరితోనో తెలిసి రావడం లేదు. అయితే ఈ మధ్య చరణ్‌తో రాజమౌళి నెక్ట్స్‌ సినిమా ఉండబోతోందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. చూడాలి, దర్శక ధీరుడు రాజమౌళి నుండి రాబోయే సినిమా ఎవరితో ఉండబోతోందో!

You May Like This
- Advertisment -spot_img

Most Popular