HomeMovie News Teluguబచ్చన్ సాబ్ కా బర్త్ డే...

బచ్చన్ సాబ్ కా బర్త్ డే…

చాలా మంది హీరోలని, స్టార్స్ ని మనం పేర్లు పెట్టి పిలుచుకోవడం చాలా సాధారణ విషయం. అయితే కొంతమందిని మాత్రం పేరుతో కాకుండా వారి పేరు చివర ‘సర్’ అనో లేక ‘సాబ్’ అనో మర్యాదతో పిలుచుకుంటుంటాము.

ఆ కోవలో మొదటివరుసలో మనకి కనపడే వ్యక్తి- అమితాబ్ బచ్చన్. నేటికి ఆయన వయసు 75 నిండుతున్నా ఆయనలో అభినయంపరంగా ఇసుమంతనైనా తప్పు కనిపెట్టలేనంతలా ఉంటుంది ఆయన నటన. ఈ వయసులో కూడా 13 యేండ్ల పిల్లాడి పాత్రయినా, 70 ఏండ్ల ముసలి పాత్ర అయినా సరే వాటిలో నటించి మెప్పించగల మహానటుడు ఈ సీనియర్ బచ్చన్.

చాలా మంది దర్శకుల, నటుల, రచయతల స్వప్నంగా కనపడే ఈ బిగ్ బి తన నిజజీవితంలో మాత్రం నటనలో తానొక నిత్య విద్యార్ధినే అని చెప్పుకోగల నిరాడంబరనటుడు. ఒక్క నటనకే పరిమితం కాకుండా ఏకకాలంలో బుల్లితెర పైన వ్యాఖ్యాతగా, డజన్ల కొద్ది వస్తువులకి ప్రచారకర్తగా, ప్రభుత్వ కార్యక్రమాలకి అంబాసిడర్ గా ఆయన బిజీ బిజీ..

వీటికి తోడు ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకి చేరువ అవుతూ వారితో తన భావాలని పంచుకుంటూ సేదతీరుతుంటారు. ఇప్పుడున్న ఎంతోమంది సూపర్ స్టార్స్ కి పరోక్ష గురువుగా కీర్తింపబడుతూ కూడా ఎంతో ఒదిగిపోయే మనస్తత్వం ఆయనని ఖ్యాతి మనకు హిమాలయమంత ఎత్తులో కనపడుతుంది.

ఇవన్ని పక్కన పెడితే ఆయనని ఒక్కక్షణం పాటైన చూడడానికి ప్రతి ఆదివారం ముంబైలోని ఆయన నివాసమైన జల్సా ముంగిట పోగయ్యే వేళమంది అభిమానులని చూస్తే ఖండాంతరాలు దాటిన ఆయన ఫాలోయింగ్ మనకి ఇట్టే తెలుస్తుంది.

ఇంతటి గొప్ప అభిమాన ఘనాన్ని తన సొత్తు చేసుకొని మూటగట్టుకున్న ఈ అసలు సిసలు సూపర్ స్టార్ కి మా www.iqlikmovies.com తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

బచ్చన్ సాబ్ ఆప్కో హమారీ తరఫ్ సే జనమ్దిన్ శుభ్కామ్నాయే…

You May Like This
- Advertisment -spot_img

Most Popular