HomeMovie News Teluguఎన్టీఆర్‌ ఆప్పుడు మాస్‌ ఇప్పుడు క్లాస్‌

ఎన్టీఆర్‌ ఆప్పుడు మాస్‌ ఇప్పుడు క్లాస్‌

అప్పుడు ‘జై’ పాత్రలో ఎన్టీఆర్‌ని చూశాం. చాలా ఇంప్రెస్‌ చేశాడు ‘జై’గా ఎన్టీఆర్‌. నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర అది. ‘ఆ రావణున్ని సంపాలంటే సముద్రం దాటాల, ఈ రావణున్ని సంపాలంటే సముద్రమంత ద..ద..ద..’ధైర్యం’ ఉండాల’ అంటూ కొంచెం నత్తితో ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌కి విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ఎన్టీఆర్‌ మరో క్యారెక్టెర్‌ ఫస్ట్‌లుక్‌ని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఇదే లవ కుమారుడి క్యారెక్టర్‌ గెటప్‌. చాలా క్లాస్‌గా ఉంది.

నీట్‌ షేవ్‌తో, టక్‌ చేసుకుని చాలా క్లాస్‌గా కనిపిస్తున్నాడు ఎన్టీఆర్‌ ఈ గెటప్‌లో. అంటే ఈ క్యారెక్టర్‌ చాలా సున్నితంగా ఉండబోతోందని తెలియ వస్తోంది. ఈ గెటప్‌కీ మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఎన్టీఆర్‌ మూడు గెటప్స్‌లో రెండు గెటప్స్‌ వచ్చేసినట్లే. ఇక ఆ మూడో గెటప్‌ ‘కుశ’ కూడా త్వరలోనే రివీల్‌ కానుంది. ఆ గెటప్‌ ఎలా ఉండబోతోందనే ఆశక్తి అభిమానుల్లో ఉంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జై లవ కుశ’ సినిమాని అత్యంత భారీ బడ్జెట్‌తో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నాడు.

ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రాశీఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో పక్క ఎన్టీఆర్‌ బుల్లితెర ద్వారా ప్రతీ వారంలోనూ రెండు రోజులు అభిమానులతో సందడి చేస్తున్నాడు. ‘జై లవ కుశ’ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular