HomeMovie News Teluguఅభిమానం ఓ అదృష్టం: పవన్‌ వీరాభిమాని నితిన్‌

అభిమానం ఓ అదృష్టం: పవన్‌ వీరాభిమాని నితిన్‌

పవన్‌ కళ్యాణ్‌కి యంగ్‌ హీరో నితిన్‌ అరి వీర భక్తుడన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకే తన సినిమాల్లో ఏదో ఒక చోట పవన్‌ కళ్యాణ్‌ని అనసరిస్తూ ఉంటాడు. ఆయన్ని తలుస్తూ ఉంటాడు. లేదా ఆయనలా గెటప్‌ వేస్తుంటాడు. ఈ సారి కూడా అదే చేశాడు. నితిన్‌ హీరోగా ‘లై’ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రోమోస్‌ అన్నింట్లోనూ నితిన్‌ పవన్‌ కళ్యాణ్‌ని తలపిస్తున్నాడు. ఓ సాంగ్‌లో లుంగీ కట్టిన రైల్వే కూలీగా పవన్‌ గెటప్‌ని యాజ్‌ ఈట్‌ ఈజ్‌ దించేశాడు.

ఈ విషయంపై ఎందుకలా అని నితిన్‌ని అడగ్గా, అది తనకు పవన్‌పై ఉన్న అతి భక్తి , ప్రేమ అంటున్నాడు. పవన్‌ కళ్యాణ్‌పై అభిమానం చాలా మందికి ఉంటుంది. కానీ తనలా ఆయన్ని ఇమిటేట్‌ చేసే అదృష్టం, ఆ భక్తిని చాటుకునే అవకాశం అందరికీ రాదంటున్నాడు నితిన్‌. ఆ విషయంలో తాను అదృష్టవంతున్ని అంటున్నాడు నితిన్‌. ఆగష్టు 11న నితిన్‌ ‘లై’ విడుదల కానుంది. మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ ఇది. భారీ అంచనాలున్నాయి. ‘అ,ఆ..’ముందు వరకూ నితిన్‌ వేరు. ఆ తర్వాత నితిన్‌ వేరు. ఈ సినిమాతో నితిన్‌లోని డిఫరెంట్‌ యాంగిల్‌ని అభిమానులు చూడబోతున్నారట. అలాగే నితిన్‌ తదుపరి చిత్రం పవన్‌ కళ్యాణ్‌ నిర్మాణంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకి త్రివిక్రమ్‌ కథనందిస్తుండగా, కృష్ణ చైతన్య డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది ఈ సినిమా.

You May Like This
- Advertisment -spot_img

Most Popular