HomeMovie News Teluguఉదయభాను అదరగొట్టేస్తోంది

ఉదయభాను అదరగొట్టేస్తోంది

బుల్లితెర యాంకర్స్‌లో ఉదయభాను ఓ సంచలనం. ఆమెకున్నంత ట్రాక్‌ రికార్డు యాంకర్‌గా బుల్లితెరపై ఎవరికీ లేదనే చెప్పాలి. ఉదయభాను అలా వచ్చి కనిపించిందంటే చాలు ఆరేళ్ల చిన్న పిల్లాడి నుండీ, ఆరవయ్యేళ్ల ముసలాడి వరకూ ఎగిరి గంతేయ్యాల్సిందే. అలాంటిది కొన్ని కారణాలతో వివాదాల్లో చిక్కుకుని ఉదయభాను బుల్లితెరపై కనుమరుగైపోయింది. అయితే ఈ మధ్య ఉదయ భాను మళ్లీ బుల్లితెరపై తన మెరుపులు మెరిపించడానికి రీ ఎంట్రీ ఇచ్చింది.

ఏమాత్రం తగ్గని గ్లామర్‌తో, అదే ఎనర్జీతో ఫుల్‌ జోష్‌గా ఓ ప్రోగ్రాంలో తన సత్తా చాటుతోంది. ఇదివరకటికి మించిన ఉత్సాహంతో ఉదయభాను కనిపిస్తోంది. ఆమె డాన్సుల్లో గ్రేస్‌ ఏమాత్రం తగలేదు. పెళ్లి చేసుకుని ఇద్దరు ట్విన్స్‌కి తల్లి అయినా కానీ ఉదయభాను అందం ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఆమెకి అంత క్రేజ్‌ మరి. ఒక పక్క యాంకర్‌గా ఉంటూనే, మరో పక్క సినిమాల్లోనూ నటించింది ఉదయభాను. దాసరి నారాయణరావు సినిమా ‘కొండపల్లి రత్తయ్య’లో ఉదయభాను హీరోయిన్‌గా నటించింది.

అలాగే ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ సినిమాలోనూ ఉదయభాను నటించింది. రానా హీరోగా తెరకెక్కిన ‘లీడర్‌’ సినిమాలో ఐటెం సాంగ్‌లో తళుక్కుమంది. ఇవే కాక పలు ఐటెం సాంగ్స్‌లో ఉదయభాను కనిపించింది. అలా ఇటు వెండితెరను, బుల్లితెరనూ కూడా తన గ్లామర్‌తో ఉర్రూతలూగించిన ఉదయభాను సడెన్‌గా మిస్‌ అయిపోయి, అభిమానులను నిరాశ పరిచింది. ఉదయభాను రీ ఎంట్రీతో మళ్లీ బుల్లితెరకు గ్లామర్‌ తిరిగొచ్చేసినట్లే!

You May Like This
- Advertisment -spot_img

Most Popular