HomeMovie News Teluguనిర్మాతగా, నటిగా బుల్లితెర హాట్ యాంకర్

నిర్మాతగా, నటిగా బుల్లితెర హాట్ యాంకర్

బుల్లితెర హాటెస్ట్‌ యాంకర్‌గా ఒకప్పుడు పాపులర్‌ అయిన ముద్దుగుమ్మ జయతి. బుల్లితెరపై యాంకర్‌గా తనదైన స్టైల్‌లో ఎట్రాక్ట్‌ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే సినిమాల్లో హీరోయిన్‌ కావాలనేది ఈ ముద్దుగుమ్మ కోరిక. అందుకు తగ్గట్లుగానే ప్రయత్నాలు చేసింది. అల్లరి నరేష్‌ హీరోగా తెరకెక్కిన ‘పార్టీ’ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో తళుక్కుమంది ఈ ముద్దుగుమ్మ. లేటెస్టుగా జయతి హీరోయిన్‌గా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి జయతినే నిర్మాత కావడం విశేషం.

‘లచ్చి’ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. గ్లామర్‌లోనూ, డాన్స్‌ల్లోనూ జయతి సూపర్బ్‌. అప్పట్లోనే తన టాలెంట్‌ చూపించేసింది. యాంకరింగ్‌లో కూడా బోలెడంత గ్లామర్‌ ఒలకబోసింది. అందుకే జయతి అంటే కుర్రకారు పిచ్చెక్కిపోయేవారు. ఆమె షోకి చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు అప్పట్లో. తాజాగా ఆమె నటిస్తోన్న సినిమాతో హాట్‌ హాట్‌గా వార్తల్లోకెక్కింది. అయితే ప్రస్తుతం బుల్లితెరపై సత్తా చాటుతూనే వెండితెరను కూడా తమ గ్లామర్‌ తళుకులతో మురిపిస్తోన్న పలువురు యాంకర్లు ఇప్పుడు పోటీగా ఉన్నారు.

యాంకర్‌ రేష్మీ, అనసూయలు అటు బుల్లితెరపైనా, ఇటు వెండితెరపైనా కూడా తమ టాలెంట్‌ చూపించేస్తున్నారు. ఈ తరుణంలో ఈ పోటీని తట్టుకుని జయతి హీరోయిన్‌గా తన సత్తా ఎలా చాటుతుందో చూడాలిక. ‘లచ్చి’ సినిమాకి సంబంధించిన ఇతర డీటెయిల్స్‌ త్వరలోనే తెలియనున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular