HomeMovie News Teluguబికినీలో హీటెక్కించిన ఎమ్మెల్యే

బికినీలో హీటెక్కించిన ఎమ్మెల్యే

మరోసారి గ్లామర్‌ పాత్రలో కిక్కెక్కించేసింది ముద్దుగుమ్మ కేథరీన్‌. గోపీచంద్‌ హీరోగా తెరకెక్కిన ‘గౌతమ్‌ నంద’ సినిమాలో కేథరీన్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ రోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి మిక్స్‌డ్‌ టాక్‌ వస్తోంది. కానీ గ్లామర్‌ ప్రియులు మాత్రం కేథరీన్‌ గురించి చర్చించుకోకుండా ఉండలేకపోతున్నారు. కేథరీన్‌ గ్లామర్‌ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాలో అమ్మడు గ్లామర్‌ పంట పండిచేసిందంతే. టూ పీస్‌ బికినీతో కుర్రకారుకే కాదు, అంకుల్స్‌కీ, తాతయ్యలకీ కూడా ఫుల్‌ పవర్‌తో కరెంట్‌ పాస్‌ అయ్యేలా చేసేసింది.

ధియేటర్లో కేథరీన్‌ బికినీ షో అదిరిపోయిందంతే. మామూలుగా ఇంతవరకూ చాలా మంది హీరోయిన్లే బికినీ సీన్లలో నటించారు. అయితే ఆ సీన్స్‌ జస్ట్‌ ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయంతే. కానీ ఈ సినిమాలో కేథరీన్‌ బికినీ సీన్‌కి డైరెక్టర్‌ ఎక్కువ నిడివే ఉంచాడు. దాంతో చూసుకున్నోళ్లకి చూసుకున్నంత అన్నట్లుగా, అమ్మడి అంగాంగ ప్రదర్శన దర్శనమిచ్చింది. సంపత్‌ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గ్లామర్‌ విషయంలో కేథరీన్‌కి అస్సలు లిమిట్సే లేవు.

సో ఎటువంటి అభ్యంతరం లేకుండా బికినీ సీన్‌లో నటించేసింది ఈ ముద్దుగుమ్మ. కావాల్సినంత అందం, అభినయం కూడా ఉందండోయ్‌. అయినా కానీ అమ్మడికి సెకండ్‌ హీరోయిన్‌ ఛాన్స్‌ తప్ప సోలో హీరోయిన్‌ ఛాన్స్‌ దక్కడం లేదు. ఏమో చూద్దాం ఈ సినిమాలో అమ్మడి బికినీ షోతోనైనా, ఇకపై సోలో పర్‌ఫామెన్స్‌ ఛాన్స్‌ దక్కించుకుంటుందేమో!

You May Like This
- Advertisment -spot_img

Most Popular