HomeMovie News Teluguబోల్డ్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ 'అర్జున్‌రెడ్డి'

బోల్డ్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ ‘అర్జున్‌రెడ్డి’

‘పెళ్లిచూపులు’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయిన హీరో విజయ్‌ దేవరకొండ. విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆ సినిమా. ఆ తర్వాత ‘ద్వారక’ సినిమాతోనూ మనోడు ఫర్వాలేదనిపించాడు. విజయ్‌ దేవరకొండ లేటెస్ట్‌ మూవీ ‘అర్జున్‌ రెడ్డి’. సందీప్‌ వంగా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ముద్దుగుమ్మ షాలిని హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తోనే ఎట్రాక్ట్‌ చేసేశాడు విజయ్‌ దేవరకొండ. టీజర్‌ విడుదలై గతంలోనే సెన్సేషన్‌ సృష్టించేసింది.

ఈ సినిమాకి సంబంధించిన అన్ని పోస్టర్స్‌ డిఫరెంట్‌గా రూపొందించి, ఎట్రాక్ట్‌ చేస్తూనే ఉన్నారు. అంతేకాదు, హీరోయిన్‌ షాలినితో, హీరో విజయ్‌ దేవరకొండ లిప్‌ లాక్‌ ఫోటోని పోస్టర్లలో నింపేయడం అప్పట్లో సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇలా ఈ సినిమా స్టార్టింగ్‌ నుండీ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తూనే ఉంది. బోల్డ్‌ కథాంశంతో డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సో ఆ రకంగా ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో లైమ్‌ లైట్‌లోకి వచ్చి, ‘పెళ్లిచూపులు’ సినిమాతో సూపర్‌ సక్సెస్‌ అందుకుని, లేటెస్టుగా ‘అర్జున్‌ రెడ్డి’ అనే పవర్‌ ఫుల్‌ టైటిల్‌తో వస్తోన్న విజయ్‌ దేవర కొండ ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి మరి. ఆగష్టు 25న ‘అర్జున్‌ రెడ్డి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular