HomeMovie News Teluguబుల్లితెరపైనా ఎన్టీయార్‌ కుమ్మేశాడంతే

బుల్లితెరపైనా ఎన్టీయార్‌ కుమ్మేశాడంతే

బుల్లితెర ‘బిగ్‌బాస్‌’ ఎవరంటే అన్న ప్రశ్నకు ఎన్టీయార్‌ అని సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇకపైన. ‘బిగ్‌బాస్‌’ రియాల్టీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నందుకు మాత్రమే కాదు, తనదైన స్టైల్‌తో ‘బిగ్‌బాస్‌’ రియాల్టీ షోని టీఆర్పీ రేటింగుల పరంగా టాప్‌ లిస్ట్‌లోకి చేర్చినందుకు. వారంలో ఐదు రోజులపాటు ‘బిగ్‌బాస్‌’ రేటింగ్స్‌ డల్‌గా ఉన్నా, ఎన్టీయార్‌ ఎంట్రీతో లెక్కలు మారిపోతున్నాయి. శని, ఆదివారాల్లో ఎన్టీయార్‌ అప్పీయరెన్స్‌కి బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.

‘బిగ్‌బాస్‌’ షో వీకెండ్స్‌లో ప్రజల మన్ననల్ని విశేషంగా చూరగొంటోందంటే దానికి కారణం ఎన్టీయార్‌ మాత్రమే. ఇంకెవరికీ సాధ్యం కాని ఎనర్జీతో ‘బిగ్‌బాస్‌’ రియాల్టీ షో వీకెండ్‌ ఎపిసోడ్‌ని ఎన్టీయార్‌ నడిపిస్తుండడం అభినందనీయం. తొలిసారిగా బుల్లితెరపైకొచ్చిన ఎన్టీయార్‌ ఈ స్థాయి సంచలనాలు సృష్టిస్తాడని ముందుగా ఎవరూ అనుకోలేదు. అయితే ‘బిగ్‌బాస్‌’ రియాల్టీ షో సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అవుతుందని మాత్రం అనుకున్నారు.

‘బిగ్‌బాస్‌’ షో కన్నా ఎన్టీయార్‌ అప్పీయరెన్స్‌ పదింతలుగా బుల్లితెర ఆడియన్స్‌ని అలరిస్తోందంటే దానికి ఎన్టీయార్‌ ఆ వేదికపై ప్రదర్శిస్తోన్న ఈజ్‌ కారణమని చెప్పక తప్పదు. ఐదు రోజులపాటు జరిగే సంఘటనల్ని మైండ్‌లో పొందుపర్చి, వాటిని రికలెక్ట్‌ చేసి, చకచకా మాట్లాడేస్తూ, తన నటనా చాతుర్యంతో ఎన్టీయార్‌ ఆకట్టుకుంటున్న వైనం గురించి ఎంత పొగిడినా తక్కువే. రికార్డ్‌ స్థాయి టీఆర్పీలతో ‘బిగ్‌బాస్‌’ రియాల్టీ షోకి వన్నె తెచ్చిన ఎన్టీయార్‌కి హేట్సాఫ్‌ చెప్పేద్దాం. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular